ఇటలీ రాయబారి దేశం విడచి వెళ్లరాదు:సుప్రీం

న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను ఇటలీ రాయబారి కోరారు. ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లకుండా సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఇటలీ రాయబారి నమ్మకం కోల్పోయారని, ఆయన మాటలు విశ్వసించబోమని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇటలీ నావికుల ఉదంతంపై విచారణను ఏప్రిల్ 2 వరకు న్యాయస్థానం వాయిదా వేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.