ఇచ్చేది బీజేపీయే

rajneethsingh
-తెలంగాణపై మాట తప్పం.. అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం
-తెలంగాణ స్వప్నం సాకారం చేస్తాం.. బిల్లు పెడితే బేషరతుగా మద్దతునిస్తాం
-తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకోం.. హృదయం లేని కేంద్ర ప్రభుత్వం
-బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్

-కాంగ్రెస్ ఎన్నిసార్లో ‘నెల’తప్పింది..
-హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్స్

BJPహైదరాబాద్, జూన్ 3:‘తెలంగాణపై ఇచ్చిన మాట తప్పం. అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. సోమవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ నగారా సమితిని దాని వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్ధన్‌డ్డి బీజేపీలో విలీనం చేసి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ బహిరంగ సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ తెలంగాణపై బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టాలని ఆయన యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పెడితే తాము బేషరతుగా మద్దతునిస్తామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పడం బీజేపీకి లేదని, మాటపై నిలబడటం బీజేపీ ప్రత్యేకతని చెప్పారు.

తెలంగాణ స్వప్నాన్ని ఎన్డీయే సాకారం చేస్తుందన్నారు. వాగ్దానాలు చేయడం, వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని ఆయన విమర్శించారు. వాగ్దానాలు చేయడం, మోసాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని రాజ్‌నాథ్‌సింగ్ ధ్వజమెత్తారు. పాలకులు విశ్వాసాన్ని కోల్పోతే ప్రజల హృదయాలు పగిలి పోతాయని, దాని ఫలితం పాలకులు అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలపై హృదయం లేని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలను నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందిగా రాజ్‌నాథ్ సూచించారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌కు సమీపంలో యాదిడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.

తెలంగాణ ఇవ్వడమే బీజేపీ ఎజెండా అని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే సమస్యే లేదని ప్రకటించారు. తెలంగాణకు వ్యతిరేక శక్తులను దరిచేరనీయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభివూపాయపడ్డారు. తెలంగాణ కోసం బీజేపీని బలపర్చాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 52 ఏళ్లు కాంగ్రెస్ పాలిస్తోందని, ఈ కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్నీ నిలుపుకున్న దాఖలాలు లేవని అన్నారు. వంద రోజుల్లో ధరలను అదుపులోకి తెస్తామని చెప్పి కొన్ని వేల రోజులు గడిచినా అమలు దిక్కే లేకుండా పోయిందన్నారు. ధరలను నియంవూతించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు.

ఎన్డీయే హయాంలో ఏనాడూ ధరలు పెరగలేదని గుర్తు చేశారు. తప్పుడు ఆర్థిక విధానాలు, అవినీతి ధరలు పెరగడానికి కారణమని విశ్లేషించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి అంతు లేకుండా పోయిందని, భూమి, ఆకాశం, పాతాళం అన్న భేదాల్లేకుండా పోయాయన్నారు. కేంద్ర మంత్రులతో సహా ప్రధాన మంత్రి పేరు కూడా అవినీతిలో చేరడం విచారకరమన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి జైలులో ఉండటం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రధాని కుర్చీని మన్మోహన్ వదలడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ నీతి నియమాలను పాటిస్తుందని, కేవలం ఆరోపణలు వస్తేనే అద్వానీ ఎంపీ పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు.

కర్ణాటకలో యడ్యూరప్పపై ఆరోపణలు వస్తే తాము వెంటనే ఆయనను తప్పించామని, నీతి కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డామని వివరించారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపచేశామన్నారు. ప్రభుత్వమంటే ఐపీఎల్ మ్యాచ్ కాదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము వాచ్‌డాగ్ పాత్రను పోషిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనమైందని విమర్శించారు. సుపరిపాలన, విశ్వసనీయత బీజేపీ ప్రధాన ఆయధాలని ఆయన చెప్పారు.

ఆది నుంచి కాంగ్రెస్సే అడ్డంకి : మురళీధర్‌రావు
తెలంగాణకు ఆది నుంచి కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకిగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు ఆరోపించారు. 1969 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణ పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉందన్నారు. తెలంగాణపై ఆజాద్ చేసిన ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వాయిదాల పార్టీ అని తేలిపోయిందన్నారు.

కాంగ్రెస్‌ది విశ్వాసఘాతుకం: విద్యాసాగర్‌రావు
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నెహ్రూ కాలం నుంచి నేటి సోనియాగాంధీ వరకు విశ్వాసఘాతుకానికి పాల్పడుతూనే ఉందని కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై వేసిన నెల వాయిదాను గులాం నబీం ఆజాద్ మళ్లీ తప్పుతారని విమర్శించారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు ఒక్క బీజేపీకే ఉందన్నారు.

ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడాలి: దత్తావూతేయ
2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ ఆకాంక్షించారు. ఎన్నికల కోసం అందరూ తెలంగాణ పాట పాడుతున్నారని, వారికి తెలంగాణ పట్ల వాస్తవానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు చలో అసెంబ్లీని తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు. టీజేఏసీలో బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తుందన్నారు.

Home >> >>
ఇచ్చేది బీజేపీయే

rajneethsingh
-తెలంగాణపై మాట తప్పం.. అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం
-తెలంగాణ స్వప్నం సాకారం చేస్తాం.. బిల్లు పెడితే బేషరతుగా మద్దతునిస్తాం
-తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకోం.. హృదయం లేని కేంద్ర ప్రభుత్వం
-బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్

-కాంగ్రెస్ ఎన్నిసార్లో ‘నెల’తప్పింది..
-హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్స్
-మీరు బీజేపీకి బటన్ నొక్కండి.. మేం తెలంగాణ బటన్ నొక్కుతాం:సీనియర్ నేత వెంకయ్యనాయుడు

BJPహైదరాబాద్, జూన్ 3 (టీ మీడియా) :‘తెలంగాణపై ఇచ్చిన మాట తప్పం. అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. సోమవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన తెలంగాణ ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ నగారా సమితిని దాని వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్ధన్‌డ్డి బీజేపీలో విలీనం చేసి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ బహిరంగ సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ తెలంగాణపై బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టాలని ఆయన యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పెడితే తాము బేషరతుగా మద్దతునిస్తామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పడం బీజేపీకి లేదని, మాటపై నిలబడటం బీజేపీ ప్రత్యేకతని చెప్పారు.

తెలంగాణ స్వప్నాన్ని ఎన్డీయే సాకారం చేస్తుందన్నారు. వాగ్దానాలు చేయడం, వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని ఆయన విమర్శించారు. వాగ్దానాలు చేయడం, మోసాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని రాజ్‌నాథ్‌సింగ్ ధ్వజమెత్తారు. పాలకులు విశ్వాసాన్ని కోల్పోతే ప్రజల హృదయాలు పగిలి పోతాయని, దాని ఫలితం పాలకులు అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలపై హృదయం లేని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలను నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందిగా రాజ్‌నాథ్ సూచించారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌కు సమీపంలో యాదిడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.

తెలంగాణ ఇవ్వడమే బీజేపీ ఎజెండా అని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే సమస్యే లేదని ప్రకటించారు. తెలంగాణకు వ్యతిరేక శక్తులను దరిచేరనీయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభివూపాయపడ్డారు. తెలంగాణ కోసం బీజేపీని బలపర్చాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 52 ఏళ్లు కాంగ్రెస్ పాలిస్తోందని, ఈ కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్నీ నిలుపుకున్న దాఖలాలు లేవని అన్నారు. వంద రోజుల్లో ధరలను అదుపులోకి తెస్తామని చెప్పి కొన్ని వేల రోజులు గడిచినా అమలు దిక్కే లేకుండా పోయిందన్నారు. ధరలను నియంవూతించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు.

ఎన్డీయే హయాంలో ఏనాడూ ధరలు పెరగలేదని గుర్తు చేశారు. తప్పుడు ఆర్థిక విధానాలు, అవినీతి ధరలు పెరగడానికి కారణమని విశ్లేషించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి అంతు లేకుండా పోయిందని, భూమి, ఆకాశం, పాతాళం అన్న భేదాల్లేకుండా పోయాయన్నారు. కేంద్ర మంత్రులతో సహా ప్రధాన మంత్రి పేరు కూడా అవినీతిలో చేరడం విచారకరమన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి జైలులో ఉండటం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రధాని కుర్చీని మన్మోహన్ వదలడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ నీతి నియమాలను పాటిస్తుందని, కేవలం ఆరోపణలు వస్తేనే అద్వానీ ఎంపీ పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు.

కర్ణాటకలో యడ్యూరప్పపై ఆరోపణలు వస్తే తాము వెంటనే ఆయనను తప్పించామని, నీతి కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డామని వివరించారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపచేశామన్నారు. ప్రభుత్వమంటే ఐపీఎల్ మ్యాచ్ కాదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము వాచ్‌డాగ్ పాత్రను పోషిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనమైందని విమర్శించారు. సుపరిపాలన, విశ్వసనీయత బీజేపీ ప్రధాన ఆయధాలని ఆయన చెప్పారు.

ఆది నుంచి కాంగ్రెస్సే అడ్డంకి : మురళీధర్‌రావు
తెలంగాణకు ఆది నుంచి కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకిగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు ఆరోపించారు. 1969 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణ పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉందన్నారు. తెలంగాణపై ఆజాద్ చేసిన ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వాయిదాల పార్టీ అని తేలిపోయిందన్నారు.

కాంగ్రెస్‌ది విశ్వాసఘాతుకం: విద్యాసాగర్‌రావు
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నెహ్రూ కాలం నుంచి నేటి సోనియాగాంధీ వరకు విశ్వాసఘాతుకానికి పాల్పడుతూనే ఉందని కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై వేసిన నెల వాయిదాను గులాం నబీం ఆజాద్ మళ్లీ తప్పుతారని విమర్శించారు. తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు ఒక్క బీజేపీకే ఉందన్నారు.

ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడాలి: దత్తావూతేయ
2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ ఆకాంక్షించారు. ఎన్నికల కోసం అందరూ తెలంగాణ పాట పాడుతున్నారని, వారికి తెలంగాణ పట్ల వాస్తవానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు చలో అసెంబ్లీని తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు. టీజేఏసీలో బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తుందన్నారు.

హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్లు: వెంకయ్యనాయుడు
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగాలని బీజేపీ జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణపై రాజకీయాలు చేయకుండా, జాప్యం కూడా చేయకుండా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 14, 17 సీట్లు ఇవ్వండి, ఇతర జాతీయ పార్టీలకు మద్దతునిస్తామంటున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ‘తెలంగాణ కోసం బీజేపీకి బటన్ నొక్కండి.. బీజేపీ తెలంగాణ బిల్లు బటన్ నొక్కుతుంది’ అని ఆయన ఉద్ఘాటించారు. టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీల వంటి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుసాధ్య కాదని ఆయన స్పష్టం చేశారు. దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పీడ, శని దాపురించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ ఇప్పటికి ఎన్నిసార్లో ‘నెల’ తప్పిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాడాలని ఆయన అన్నారు. హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్లు విధిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణను ఇడ్లీ, దోశతో పోల్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. భూమి, ఆకాశం, పాతాళం, అంతరిక్షం, నీరు, నిప్పు, ఉప్పు, చివరికి చెప్పు కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు.

Other News
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.