ఇక.. సమరమే

 

tngo
– నవంబర్ 1న విద్రోహదినం.. 9న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
– 14న కలెక్టరేట్‌ల ఎదుట బైఠాయింపు
– డిసెంబర్‌లో ‘చలో హైదరాబాద్’
– మంత్రుల నియోజకవర్గాల్లో పాదయావూతలు
– ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీ ఉద్యోగుల జేఏసీ
తెలంగాణ ఉద్యోగులపై అనుసరిస్తున్న అణచివేత, కఠిన వైఖరులకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇందులోభాగంగా డిసెంబర్ రెండోవారంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. చట్టాలు, నిబంధనలు, జీవోలను ఉల్లంఘించి, పాలకులు తెలంగాణ ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయిస్తున్నార ని విమర్శించారు. ఉద్యమకారులను ముప్పుతిప్పలు పెడుతున్న సర్కారు.. తెలంగాణ ఉద్యోగులను అనివార్యంగా ఆందోళనబాట పట్టిస్తున్నదని టీ ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులు ఆరోపించారు. ఉద్యోగులపై జరుగుతున్న అణచివేతకు తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని, ఇక నుంచి మంత్రుల నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ హెచ్చరించింది. బాష్పవాయు గోళాల ప్రభావంతో మరణించిన రాజిడ్డి ఉదంతంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసింది. గురువారం టీఎన్జీవో భవన్‌లో టీ ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్షికమంలో టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రెటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ సీ విఠల్, కరీంనగర్ జేఏసీ నాయకులు హమీద్, ఖమ్మం జల్లా టీఎన్జీవో అధ్యక్షుడు రంగారావు, తెలంగాణ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు హర్‌నాథ్‌బాబు, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జ్ఞానేశ్వర్, హైదరాబాద్ జేఏసీ బాధ్యులు కృష్ణయాదవ్, మహిళా విభాగం నాయకురాలు రేచల్, టీటీఈఏ కార్యవర్గ సభ్యులు మోహన్, టీ గెజిటెడ్ మెడికల్, హెల్త్‌ఫోరం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, ఇంజినీరింగ్ జేఏసీ అధ్యక్షుడు వెంక పాల్గొన్నారు.

డిమాండ్ల సాధనకు పోరాటం: జేఏసీ నేతలు
సమావేశంలో దేవీవూపసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పదో పీఆర్సీ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నదని, అన్నీ వనరులు ఉన్నప్పటికీ, నవంబర్ 1వ తేదీ నాటికి హెల్త్‌కార్డులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మె కాలానికి ప్రత్యేక సెలవు ఇవ్వాలని చేసిన డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దలు తుంగలో తొక్కారని, ఈ మూడు డిమాండ్ల సాధనకు ఆందోళనలు నిర్మిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ రెండో వారంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగులు లక్షల సంఖ్యలో చలో హైదరాబాద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న తెలంగాణ ఉద్యోగులు విద్రోహదినంగా పాటించాలని, సమైక్యాంధ్ర పాలకులు ఇచ్చే ప్రశంసాపవూతాలను విసిరికొట్టాలని టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పిలుపునిచ్చారు. నవంబర్ 9న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపడుతామని, నవంబర్ 14న కలెక్టరేట్ల ఎదుట బైఠాయింపులు చేస్తామని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సెక్రెటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు, టీడీపీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు తెలంగాణ ఉద్యోగులపై బనాయించిన కేసులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కో చైర్మన్ సీ విఠల్ ప్రసంగిస్తూ తెలంగాణ మంత్రులు, ప్రజావూపతినిధులు, ప్రజల ముందు దోషులుగా నిలిచే రోజు వచ్చిందన్నారు. ఉద్యమాలతోనే ఉద్యోగుల డిమాండ్లను, తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.