ఇక గ్రేటర్‌గా వరంగల్

– నగర పాలక సంస్థలో 42 గ్రామాల విలీనం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
వరంగల్ నగర పాలక సంస్థ గ్రేటర్‌గా అవతరించబోతోంది. నగరం చుట్టూ ఉన్న గ్రామాల విలీన ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 42 గ్రామాలను విలీనం చేస్తూ జీవో జారీ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రేటర్‌కు గ్రామాల విలీన ప్రక్రియ ముగియడంతో మార్గం సుగమమైంది. గ్రామాలను విలీనం చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీచేయడంతో కార్పొరేషన్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 493 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 10 లక్షలు దాటింది. మరో పది రోజు ల్లో గ్రేటర్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కార్పొరేషన్ చుట్టూ కిలోమీటర్ల పరిధిలో ఉన్న 42 గ్రామాలు విలీనమయ్యాయి.

కార్పొరేషన్ అధికారులు 47 గ్రామాలను విలీనం చేయాలంటూ ప్రతిపాదనలు పంపించగా 42 గ్రామాలను మాత్రమే విలీనమయ్యాయి. హన్మకొండ మం డల పరిధిలో 19 గ్రామాలు, గీసుగొండ మండలంలో cc, హసన్‌పర్తి మండలంలో 10, ధర్మసాగర్ మండలంలో 2, సంగెం మండలంలో 2,వర్దన్నపేట మండంలో ఒక గ్రామం విలీనమయ్యాయి. ప్రస్తుతం హన్మకొండ మండలంలో నాలుగు గ్రామాలే మాత్రమే విలీనం కాలేదు. ప్రతిపాదనలు పంపింనా పరిగణలోకి తీసుకోలేదు. కాగా, ఖమ్మం జిల్లాలో9, తూర్పుగోదావరి జిల్లాలోని షగామాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఖమ్మం అర్బన్ మండలంలో ఉన్న 2హగామ పంచాయతీల్లో 9 పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కాగా మిగిలిన 11 పంచాయతీలతో కలిపి రఘునాధపాపూంను కొత్తగా మండల కేంద్రంగా ఏర్పాటుచేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.