ఇక్కడ ఉక్కుపాదం.. అక్కడ ఉదాసీనం

-సీమాంధ్ర ఉద్యమంపై సర్కారు తీరు ఆశ్చర్యకరం
-టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం
-రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: టీ జేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ
-ఎమ్మెల్యే కోమటిరెడ్డికి టీ జేఏసీ సన్మానం
సీమాంధ్ర ఉద్యమంపై సర్కారు తీరు ఆశ్చర్యకరంగా ఉం దని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆక్షేపించారు. సీమాంవూధలో‘ప్రజాస్వామ్య స్ఫూర్తి’తో వెల్లివిరుస్తోందని ఎద్దేవా చేశారు.
tjacsaba
విగ్రహాలను కూల్చివేస్తూ దహనాలకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బైండోవర్లు, అరెస్టులు, లాఠీఛార్జీలు చేసిన ప్రభుత్వం సీమాంవూధలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ డిమాండ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిడ్డి వెంకటడ్డిని ఆదివారం ఆయన నివాసం లో టీ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. కేంద్రం గత నెల 30న తెలంగాణ ప్రకటన చేయడంతో.. తెలంగాణ ఉద్యమానికి సహకరించిన నేతలను టీజేఏసీ సన్మానిస్తున్నా రు. ఇందులో భాగంగా ఆదివారం మాజీ మంత్రి వెంకటరెడ్డికి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఘోషిస్తున్న సీమాంధ్ర మీడియాకు తెలంగాణ ప్రజల గోస కంటికి కనిపించడంలేదా?అని ప్రశ్నించారు. భూమి ఆకాశం దద్దరిల్లేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు, నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రకటనతోనే సంతృప్తి చెందకుండా రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ త్యాగధనులను, ఉద్యమాలు చేసిన ఉద్యోగులు, విద్యార్ధులు, రాజకీయనేతలతో పాటు అన్ని వర్గాల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రకటన రాకముందే మంత్రిపదవికి రాజీనామా చేసి కోమటిడ్డి తన నిబద్ధతను చాటుకున్నారని అభినందించారు. కార్యక్రమంలో శ్రీనివాసగౌడ్, అశ్వత్థామరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, విద్యుత్ జేఏసీ నేత రఘు, అద్దంకి దయాకర్, రసమయి బాలకృష్ణ, శైలేష్‌రెడ్డి, పల్లే రవికుమార్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.