ఇందూరు ఊపిరిపీల్చుకో..

ధర్మపురి సంజయ్.. తండ్రి ఎంత కూల్ గా ఉంటాడో.. కొడుకు అంత హాట్ గా ఉంటాడు.  జూనియర్‌ డీఎస్.. అంటే ఏంటో శాంకరీ జూనియర్‌ కాలేజీ విద్యార్థినులకు బాగా తెలుసు. ఆ కాలేజీ నడిచినన్ని రోజులు విద్యార్థి సంఘాల నేతలకు ఆ బిల్డింగ్‌ ముందు ధర్నా చేయడమే పనిగా ఉండేది. నిజామాబాద్‌ మాజీ మేయర్ సంజయ్‌పై లైంగిక  వేధింపుల ఆరోపణలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు హోంమంత్రికి ఫిర్యాదు చేయడం.. సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇందులో రాజకీయకోణం ఉందని ఇదంతా ఎంపీ కవితే చేసిందని సంజయ్‌ గ్యాంగ్‌ ఇందూరులో ప్రచారం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాన్ని బ్లేమ్‌ చేయొచ్చనుకున్నారు. కానీ సంజయ్‌ అంటే ఏంటో ఇందూరు మొత్తానికి తెలుసు. కాబట్టి నిజామాబాద్‌ ప్రజలకు  ఎంపీ కవిత అంటే అభిమానం పెరిగింది.   సంజయ్‌పై కేసు పెట్టింది.. బాధితులైన నర్సింగ్ విద్యార్థినులు. దీనికి రాజకీయ దురుద్దేశం ఆపాదించి.. ఎంపీ కవితను బ్లేమ్ చేయాలన్న జూనియర్ డీఎస్‌ కోటరీ  పన్నాగం రివర్స్‌ అయింది.  ఎంపీ కవిత గ్రాఫ్‌ ఇందూరులో అమాంతం పెరిగింది. విద్యార్థినులకు కవిత అంటే ఆరాధన భావం కలిగింది.  సంజయ్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నేతలు మాజీ మేయర్‌ పాపం పండిందని.. అతనికి కఠిన శిక్ష పడాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిర్భయ కేసు నేపథ్యంలో సంజయ్‌ నిజామాబాద్‌ను విడిచివెళ్లాడని ప్రచారం జరుగుతుంది. సంజయ్ వెళ్లిపోయాడు.. ‘‘ఇందూరు ఊపిరిపీల్చుకో’’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు పంచ్‌ డైలాగ్‌లు విసురుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *