ఇంత దురహంకారమా?

 

ktr
సీఎంపై మండిపడిన టీఆర్‌ఎస్
– వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
– లేకుంటే అన్నంత పనీ చేస్తామని హెచ్చరిక
– తెలంగాణ ప్రజల కళ్లలో మట్టి కొట్టే కుట్ర : ఈటెల
తెలంగాణ ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దురహంకారంతో వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. బయ్యారం నుంచి తట్టెడు ముడి ఇనుమును కూడా తరలనిచ్చేది లేదని హెచ్చరించారు. ముడి సరుకు లభించిన చోటే కంపెనీలు ఏర్పాటు చేయాలనే సహజ న్యాయ సూత్రాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను తరలించడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పాతరేస్తారని తేల్చి చెప్పారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలతో కలిసి ఈటెల రాజేందర్, బీ వినోద్‌కుమార్, కే తారకరామారావు, స్వామి గౌడ్ మీడియాతో మాట్లాడారు. బయ్యారంలోనే స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ప్రజల కళ్లలో మట్టి కొట్టే కుట్ర: ఈటెల
తెలంగాణ ప్రజల కళ్లలో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాబోయే కాలంలో పదునైన ఉద్యమాలతో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. జంషెడ్‌పూర్, దుర్గాపూర్‌లో ఆపారమైన ఖనిజ సంపద ఉండటం వల్లనే ఆక్కడ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, విశాఖలో మాత్రం ఒడిశా నుంచి ముడి ఇనుము తీసుకుచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఆపారమైన ఖనిజ సంపద ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం లేదా వరంగల్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో రక్షణ స్టీల్‌కు అనుమతులు ఇచ్చినప్పుడు తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాము చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్‌కు తరలించేందుకు జారీ చేసిన జోవోను రద్దు చేయకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తెలంగాణకు ఒక్క పైసా ఇచ్చేది లేదని నిండు సభలో సీఎం కిరణ్ అన్నప్పుడే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోయాయని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రాజకీయనికి పాల్పడుతోంది: బోయినపల్లి వినోద్
తెలంగాణ వనరులను సీమాంవూధకు దోచిపెడుతూ ప్రభుత్వం కుటిల రాజకీయానికి పాల్పడుతున్నదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీ వినోద్‌కుమార్ విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అందుకు ప్రభుత్వం సిద్ధమేనా? అంటూ వినోద్ సవాల్ విసిరారు. బయ్యారంలో మెదట ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుసి, 15 ఏళ్ల తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పడంలోనే కుట్ర దాగి ఉందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే సమయానికి బయ్యారంలోని ముడి సరుకును విశాఖకు తరలిస్తారని.. ఆ తర్వాత ముడి ఇనుము లేదని ప్రభుత్వం చేతుపూత్తేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఆ శక్తిలేదు: కేటీఆర్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు నడిపిన సీమాంధ్ర నేతలు తెలంగాణ ఉక్కు మాత్రం విశాఖకు చెందాలనడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించి మూడు జిల్లాల గిరిజన భూమి పుత్రులకు అన్యాయం చేయాలని చూస్తే.. తెలంగాణ ఉద్యమంతో భూ కంపం సృష్టిస్తామని హెచ్చరించారు. ఆ భూ కంపాన్ని అడ్డుకునే శక్తి సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీఎం ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం వల్ల విద్యార్థులు నష్టపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై చర్చకు రావాలని సీఎంకు సవాలు విసిరారు.

వనరుల దోపిడీకి కుట్ర: స్వామిగౌడ్
ఓబుళాపురం, రాయదుర్గం గనులను ఇస్పాత్ నిగం కోరితే.. ప్రభుత్వం మాత్రం బయ్యారం గనులను ఎందుకు కేటాయించిందని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రశ్నించారు. ఇది తెలంగాణ వనరుల దోపిడీకి జరిగిన కుట్రని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌డ్డి, తాటికొండ రాజయ్య, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, బిక్షపతి, విద్యాసాగర్, ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పాతూరి సుధాకర్‌డ్డి, పార్టీ నేతలు దాసోజ్ శ్రవణ్, చెరుకు సుధాకర్, సుదగాని వెంక త పాల్గొన్నారు.

భూకంపం సృష్టిస్తాం: హరీశ్
మే నెలలో కచ్చితంగా భూకంపం సృష్టిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఏం చేస్కుంటావో.. చేస్కో అని ముఖ్యమంవూతికి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నాడు అసెంబ్లీలో ఒక్కరూపాయి ఇవ్వనన్న సీఎం, నేడు బయ్యారం పేరుతో పూర్తిగా ఖనిజాన్ని తరలించుకు పోయేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మె కాలంలో తన జీతం తాను తెచ్చుకోలేని ముఖ్యమంత్రి, భూకంపాన్ని ఎలా ఆపగలరని ఎద్దేవా చేశారు. అడ్డుకుంటామంటూ చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నీలాంటి ముఖ్యమంవూతులను తెలంగాణ ఉద్యమం ఎందరినో చూసిందని చెప్పారు. తెలంగాణ ఖనిజాన్ని తరలించుకొని పోతున్నామని చెప్పినా.. సిగ్గులేని తెలంగాణ మంత్రులు సీఎం పక్కన కూర్చుంటున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో ఏం మాట్లాడలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు హరీశ్ ఘాటుగా స్పందించారు. ‘వైఎస్ ఉన్నప్పుడు ఏం మాట్లాడామో మాకు తెలుసు. వైఎస్ అక్రమాలకు నాడు చీఫ్ విప్‌గా ఉన్న నువ్వే సూత్రధారివి’ అని ఆరోపించారు.

అజ్ఞాని, అహంకారి: గుంతకండ్ల
రాచరికపు నియంతృత్వ పద్ధతుల్లో సీఎం కిరణ్ వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుంతకండ్ల జగదీశ్‌డ్డి విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ భూకంపం సృష్టిస్తే.. తెగిన గాలిపటంలా సీఎం కొట్టుకపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఎలాగు పోతున్నామని, ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటారా? అని నిలదీశారు. కేసీఆర్‌లా మాట్లాడాలన్న తాపవూతయంతో మాట్లాడుతున్నారని, ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.