ఇంటెలిజెన్స్‌ బ్యూరో పనిచేస్తుందహో(ప్రభుత్వం కోసం)!!

పోలీసులు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రజల కోసం పనిచేస్తయని అంతా అనుకుంటారు. కానీ ఇవి ప్రభుత్వాల కోసం మాత్రమే పనిచేస్తాయని మరోసారి నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో నిఘా సంస్థలున్నయి. పోలీసులు ఉన్నరు. కానీ వీళ్లు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులపై నిఘాపెట్టరు.  టెర్రరిస్టులొచ్చి బాంబులు పెట్టి జనాలను చంపినా.. వారిని గుర్తించరు. దర్యాప్తు గుండు సూది మందం కూడా జరగదు.

ఇదే ఇంటెలిజెన్స్‌ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి చాలా షార్ప్‌ అయిపోతుంది. ముఖ్యమంత్రికి, సీఎస్‌లకు తెలంగాణవాదులపై నివేదికల మీద నివేదికలు ఇస్తుంది. తాజాగా చలో అసెంబ్లీకి అనుమతిస్తే హింసాత్మక ఘటనలు జరుగుతయని ఇంటెలిజెన్స్‌, డీజీపీ సీఎంకు నివేదికలిచ్చారు.  రెండు రోజుల ముందే తెలంగాణ వాదులను  అక్రమంగా అరెస్ట్‌ చేయాలని, నిఘా పెంచాలని రిపోర్ట్‌ లిచ్చారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.