ఇంకా లభ్యంకాని ఇద్దరు సైనికుల జాడ

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో ఇద్దరు సైనికుల జాడ ఇప్పటికీ తెలియడం లేదు. వారం రోజులు గడుస్తున్నా.. వారి గురించిన ఆనవాళ్లు లభించడం లేదు. గర్వాల్ ప్రాంతంలో తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు చిన్న ఆధారం కూడా దొరకలేదు. కేదార్‌నాధ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు తీవ్ర వరదల్లో చిక్కుకోవడంతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగ సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే. జూన్ 25న బాధితులను మిగ్-17 హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా గౌరికుంద్ వద్ద కూలిపోయి అందులో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు సైనికులు కర్ణాటకకు చెందిన బసవరాజ్ యరగట్టి, అహిర్‌రావ్ గణేష్ (మహారాష్ట్ర) జాడ ఇప్పటివరకు దొరకలేదు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.