ఆ పోస్టులను రద్దు చేయాల్సిందే

సీఏఎస్ నియామకాలు తెలంగాణరాష్ట్రం ఏర్పాటు అనంతరమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు డీహెచ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సీఏఎస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తోడయ్యారు. సాయంత్రం డీడీ రాజశేఖర్‌డ్డి కార్యాలయానికి చేరుకోవడంతో ఆయనను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. nirasana
సీఏఎస్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న డాక్టర్ లక్ష్మి తమకు జరిగిన అన్యాయంపై అధికారులతో వాదించి బోరున విలపించారు.

ఏపీపీఎస్సీ జారీ చేసిన 132 జీవోకు విరుద్దంగా నియామకాలు చేపట్టడమేంటని ప్రశ్నించారు. డీహెచ్ వచ్చి స్వయంగా నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే కార్యాలయాన్ని విడిచివెళ్లేది లేదని భీష్మించారు. డీడీ రాజశేఖర్‌డ్డి ఈ విషయమై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె రాత్రి 7గంటల సమయంలో కార్యాలయానికి చేరుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీ రమేష్, సెక్రటరీ జనరల్ డాక్టర్ ప్రవీణ్, ప్రతినిధులు డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ లాలూవూపసాద్ రాథోడ్, టీజీవో ప్రతినిధి జూపల్లి రాజేందర్ తదితరులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో మాట్లాడి శనివారం మధ్యాహ్నంలోపు నిర్ణయం తెలియజేస్తామని డీహెచ్ డాక్టర్ అరుణకుమారి టీజీజీడీఏ ప్రతినిధులకు చెప్పారు. మధ్యాహ్నంలోపు నియామకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే శనివారం మధ్యాహ్నం నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పవూతుల్లో అత్యవసర వైద్య సేవలతో సహా అన్ని సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపడతామన్నారు
కోట్లాది రూపాయలు చేతులు మారాయి:టీజీజీడీఏ
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో సీఏఎస్ పోస్టులు ఒక్కోటి రూ.10లక్షలకు అధికారులు అమ్మున్నారని టీజీజీడీఏ ప్రతినిధులు ఆరోపించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి సుమారు రూ.6కోట్ల 14లక్షల కుంభకోణంలో ఇరుక్కున్నారని, ఆమె పారదర్శకంగా నియామకాలు ఎలా చేపడతారని వారు ప్రశ్నించా

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.