ఆ ఐదుగురి సంగతేంది?

 

next-vetu -సబిత, ధర్మానా రాజీనామాల ఆమోదం
– మిగిలిన వారిపై వేలాడుతున్న కత్తి!
-త్వరలోనే మరికొందరికి ఉద్వాసన
ఎట్టకేలకు ఇద్దరు మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయి. హోం మంత్రి పదవి నుంచి సబితా ఇంద్రాడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి పదవి నుంచి ధర్మాన ప్రసాదరావు వైదొలిగారు. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకొని పదవి కోల్పోయిన మంత్రుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇదే కేసులో మంత్రి పదవికి రాజీనామా చేసి.. మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉండగా, ఆదివారం సబిత, ధర్మాన కూడా ఇంటి బాట పట్టారు. దీంతో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మంత్రులపై వేటుపడినట్లయ్యింది. మరో ఐదుగురు కళంకిత మంత్రులపై కూడా అధిష్ఠానం ఇదేరీతిలో మంత్రదండం ప్రయోగించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల విషయంలో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతాడ్డిలకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్‌లో నమోదు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ప్రతిష్ఠకే మచ్చ వచ్చే ప్రమాదం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతోపాటు వివిధ కేసులను ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే మిగిలిన ఐదుగురు మంత్రులపై కూడా వేటు ఖాయమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి మొత్తం ఆరుగురు మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో సుమారు ఏడాది కిందట రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సీబీఐ అరెస్టు చేయడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఇదే కేసులో తొమ్మిది నెలల క్రితం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అభియోగాలు మోపుతూ సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. జగన్ కేసు చార్జిషీట్‌లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్చారు. అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రిత మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రాడ్డిల నుంచి సీఎం రాజీనామాలు తీసుకున్నారు. ఆదివారం గవర్నర్‌కు పంపడంతో వెంట రాజీనామాలు ఆమోదం పొందాయి. అయితే మరో ఐదుగురు మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తింపజేయాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జే గీతాడ్డి, కన్నా లక్ష్మినారాయణలు ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివాదాస్పద జీవోల వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ నోటీసులు అందుకున్నారు. రేపో, మాపో వీరిపై కూడా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదని ఆ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఫెరా కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథికి కింది కోర్టు శిక్ష విధించింది.అలాగే రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్‌పై ఇటీవలే మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఐదుగురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మంత్రులను తొలగించాల్సి వస్తే సీఎం కిరణ్డ్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతోపాటు తనకు తలనొప్పిగా తయారైన ఒకరిద్దరు సీనియర్ మంత్రులను కూడా సీఎం తప్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పునర్వ్యవస్థీకరణ చేపడితే సీఎం తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.

vetuministers ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పీ సబితా ఇంద్రాడ్డి రాజీనామాలను గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. సీబీఐ చార్జిషీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మంత్రుల రాజీనామాలను సీఎంకిరణ్‌కుమార్‌డ్డి ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌కు పంపించారు. సీఎం వద్ద నుంచి మంత్రుల రాజీనామా లేఖలు వచ్చిన వెంటనే గవర్నర్ వాటికి ఆమోదముద్ర వేశారు. మధ్యాహ్నం నాటికి మంత్రుల రాజీనామాలపై గవర్నర్ ఆమోదం ఖరారైంది. దీనిపై రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ముఖ్యకార్యదర్శి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి సలహా మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోం శాఖ మంత్రి సబితా ఇంద్రాడ్డి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తక్షణమే ఆమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

nexthome హోంశాఖ ఎవరికి?
హైదరాబాద్, మే 26 (టీ మీడియా): రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రాడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో ఆ శాఖ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం సన్నిహిత మంత్రులతోపాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ కోసం పోటీపడుతున్నారు. అధిష్టానం నుంచి ఒత్తిడి వస్తే ఉప ముఖ్యమంవూతికే హోం దక్కే అవకాశం లేకపోలేదు. సంప్రదాయంగా చూస్తే ఉప ముఖ్యమంవూతిగా విధులు నిర్వహించేవారికే హోం శాఖ బాధ్యతలు అప్పగించిన దాఖలాలున్నాయి.

అంతేకాకుండా సీఎం, పీసీసీ అధ్యక్షుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు ఉన్నప్పుడు హోం శాఖను తెలంగాణవారికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో హోంశాఖ పదవి కోసం తెలంగాణ మంత్రుల్లో తీవ్రస్థాయిలో పోటీనెలకొంది. అయితే హోం శాఖను మళ్ళీ మహిళకే ఇవ్వాలని సీఎం భావిస్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ లేదా మెదక్ జిల్లాకు చెందిన సునీతాలకా్ష్మడ్డిలకు అవకాశం ఉండవచ్చు. కరీంనగర్ జిల్లాకు చెందిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే వచ్చేది ఎన్నికల సమయం కావడంతో ఎంతో కీలకమైన హోంశాఖను సీనియర్ మంత్రులకే అప్పగించేపక్షంలో ఆ అవకాశం మళ్ళీ కుందూరు జానాడ్డికే దక్కవచ్చనే అభివూపాయం వ్యక్తమవుతోంది.

This entry was posted in ARTICLES.

Comments are closed.