ఆహార భద్రతకాదు, ఓట్ల భద్రత: బీజేపీ

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇవాళ ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆపార్టీ సభ్యుడు మురళి మనోహర్ జోషీ మాట్లాడారు. ఈ బిల్లు ఆహార భద్రత బిల్లులా లేదని, ఓట్లను భద్రంగా ఉంచుకునే బిల్లులా ఉందని విమర్శించారు. ఇది కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చిన బిల్లు అని దుయ్యబట్టారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.