ఆస్కార్ ను హడలెత్తించిన హరీష్

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నదని.. వాయలార్ రవి లాంటి ముఖ్య నేతలు తెలంగాణపై సిల్లీ కామంట్స్ చేస్తున్నపరని హరీష్ రావు ఫైర్ అయిన్రు. కాంగ్రెస్ నేతల బాధ్యతారాహిత్యమైన మాటలవల్లే తెలంగాణ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. ఈ విషయాన్ని సోనియా గాంధీ ద్రుష్టికి తీసుకెళ్లాలన్నరు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆస్కార్ ఫెర్నాండేజ్ ప్రసంగాన్ని అడ్డుకున్నరు. దీంతో హడలెత్తిపోయిన ఫెర్నాండేజ్ హైకమాండ్ కు చెప్తనని  హామీ ఇచ్చిన్రు. అటు హరీష్ రావు వ్యాఖ్యలకు అడ్డంపడేందుకు కాంగ్రెస్ బుడ్డర్కం పొంగులేటి ట్రై చేసిండు. కానీ పొంగులేటికి హరష్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన్రు. తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు అడ్డంపడొద్దని చెప్పిన్రు. ఇండైరెక్ట్ గా పొంగులేటిని మూసుకుని కూర్చోమని వార్నింగ్ ఇచ్చిన్రు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.