ఆసీస్‌పై భారత్ హ్యాట్రిక్ విక్టరీ

మొహాలీ : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సీరిస్‌లో 3-0 ఆధిక్యంతో భారత్ సీరిస్‌ను కైవసం చేసుకుంది. వరుసగా మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 408 పరుగులు చేయగా, భారత్ 499 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 223 పరుగులు చేసి, భారత్‌కు 133 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. భారత్ 33.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. టెస్టు సీరిస్‌లో వరుసగా మూడు సార్లు విజయం సాధించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరి టెస్టు 22 నుంచి ఢిల్లీలో జరగనుంది. అజారుద్దీన్ కెప్టెన్సీలో 1993, 1994లో భారత్ వరుసగా మూడు సార్లు విజయం సాధించింది.

3 వికెట్ల నష్టానికి 75 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదురోజు మ్యాచ్ ప్రారంభించిన ఆసిస్‌ను ఫస్ట్ సెషన్‌లో భారత్ 132 పరుగులకు ఆలౌట్ చేసింది. నాలుగు రోజు భావనేశ్వర్ కుమార్ టాప్ 3 వికెట్లను పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. చివరి రోజు ఉదయం అశ్విన్(2), జడేజా(3), ప్రజ్ఞాన్ ఓజా(2) వికెట్లతో తమ సత్తా చాటడంతో ఆసిస్‌పై భారత్ విక్టరీ ఖాయమైంది. 133 పరుగుల విజయ లక్ష్యంలో మురళీ విజయ్(26), పుజారా(28), కోహ్లీ(34)లు మ్యాచ్‌ను విజయం వైపు సాఫీగా సాగించగా చివర్లో సచిన్(21), కెప్టెన్ ధోని(18), జడేజా(8)లు సూపర్‌గా ఆడి విక్టరీ సాధించారు. చివర్లో ధోనీ వరుసగా 3 ఫోర్లు కొట్టడం విశేషం

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.