సంపూర్ణ తెలంగాణ కోసం ఒక్కటవుదాం

తెలంగాణ రాష్ట్రం సాకారమవుతున్న తరుణంలో సీమాంధ్ర కుట్రలను ఎదుర్కొనేందుకు పార్టీలకతీతంగా తెలంగాణ ప్రాంత నేతలు ఏకమై ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధినేత కే చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కే జానారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు జనవరి 2న అన్ని పార్టీల తెలంగాణ నేతలతో చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి ముహూర్తం ఖరారు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని కళింగ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు సతీమణి వసంతకుమారి దశదిన కర్మ కార్యక్రమంలో కేసీఆర్, జానారెడ్డిలతోపాటు పలువురు తెలంగాణ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, జానారెడ్డిలు చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న జానారెడ్డి నివాసానికి మంత్రి ఎన్ ఉత్తంకుమార్‌రెడ్డితో కలిసి కేసీఆర్ వెళ్లారు.
janareddy
జానారెడ్డి నివాసంలో వీరంతా సుమారు రెండు గంటలపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విషయం తెలుసుకున్న పలువురు టీఆర్‌ఎస్ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఒక్కొక్కరుగా జానారెడ్డి నివాసానికి తరలివచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులో తెలంగాణకు వ్యతిరేకంగా, నష్టం కలిగించేలా ఉన్న అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ, పింఛన్, నదీజలాలు, ఉమ్మడి రాజధాని, గవర్నర్‌పాలన వంటి క్లిష్టమైన అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని పార్టీల నేతలు ఏకమై ఉద్యమించాలని నిర్ణయించారు. జనవరి 3వ తేదీ నుంచి శాసనసభ శీతాకాల రెండవ విడత సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు.. 2న అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ ప్రాంత నేతలు, టీ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలతో అఖిలపక్ష భేటీ నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని, అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహాలను రచించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో జీవోఎం ప్రస్తావించని అనేక అభ్యంతరకరమైన అంశాలను పొందుపర్చారని భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు అభివూపాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణకు నష్టం కలుగజేసే ఆయా అభ్యంతరాలను తొలగించుకునేలా తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల నేతలు పార్టీలతీతంగా ఏకమయ్యేందుకు అనుసరించాల్సిన వైఖరిపై కేసీఆర్, జానాలు ఈ భేటీలో కీలక మంతనాలు జరిపారు. ‘చారిత్రాత్మక సమయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలకుచెందిన తెలంగాణ నేతలపై ఉంది. ఇందుకు మనందరం పార్టీలకతీతంగా ఏకం కావాల్సిన సమయం అసన్నమైంది’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

‘తెలంగాణ ఏర్పాటును ఆమోదిస్తూనే మరోవైపు ఈ ప్రాంతానికి అప్పులు మిగిల్చాలనే కుట్ర జరుగుతున్నది. సీమాంధ్రకు అన్యాయం అంటూనే తెలంగాణపై మరింత భారంమోపే కుట్రలకు సీమాంధ్రులు తెరలేపారు. ఇందులో భాగంగానే స్థానికేతర ఉద్యోగులను విభజన అనంతరం కూడా తెలంగాణలోనే కొనసాగేలా తెలంగాణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్నారు’ అని సమావేశంలో నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిని గవర్నర్ పాలన పరిధిలో పెట్టడం, ఉమ్మడి రాజధాని, ఆస్తుల పంపకం వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. దీనిని అడ్డుకుని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇరు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నదీజలాల విషయంలో సీమాంవూధులు అనేక అపోహలను సృష్టిస్తున్నారని, తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సీమాంవూధులు తరలించుకుపోయేందుకు చేస్తున్న కుట్రలను ఢిల్లీ స్థాయిలో ఎదుర్కోవాలని నిర్ణయించారు.

ఇందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీలు ఏకంకావాలని, పార్టీలకతీతంగా ఒక్కటిగా తమ గళాన్ని వినిపించి చర్చల స్థాయిలోనే అన్యాయాలను అడ్డుకునేలా ఐక్యంగా ఉద్యమించాలని తీర్మానించారు. సమావేశంలో మంత్రి బస్వరాజు సారయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ చీఫ్ విప్ మధుయాష్కీ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, జీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్, ఉపనేత హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, టీజీవో అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ములుగూరు భిక్షపతి, రాజయ్య, హరీశ్వర్‌డ్డి, వినయ్‌భాస్కర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, జోగు రామన్న, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, మహమూద్‌అలీ పాల్గొన్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలువడానికి కొద్దిగంటల ముందు టీఆర్‌ఎస్ నేతలు, జానారెడ్డి, టీ కాంగ్రెస్ నేతలతో దాదాపు రెండు గంటలకు పైగా భేటీ జరపడం.. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఒకే మాట…ఒకే బాట: జానాడ్డి:
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో తెలంగాణకు అనుకూల, ప్రతికూల అంశాలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించినట్లు సీనియర్ మంత్రి జానారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు తమవంతు పాత్ర నిర్వర్తించారని, ఇకమీదట ఇదే వైఖరితో ఒకే మాటతో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. బిల్లు పాసయ్యేంతవరకు అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఐక్యత కొనసాగిస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష తుది దశకు చేరింది…తెలంగాణపై అన్ని పార్టీలు ఐక్యంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సంకేతంగా ఉద్యమించాల్సిన సమయమిది. అందుకే పార్టీలు, దారులు వేరైనా మా గమ్యం ఒక్క జానారెడ్డి అన్నారు.

గురువారం ఆయన నివాసంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాకు సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్ర విబజన ముసాయిదా బిల్లు నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించారని పేర్కొన్నారు. తెలంగాణ ఒక్కటే లక్ష్యమని, ఆ దిశలో పార్టీలు వేరైనా అవగాహనతో ఉమ్మడిగా ముందుకుసాగాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో కీలక సమయంలో ఇదే తరహాలో కేసీఆర్ మీ నివాసానికి వచ్చినపుడు టీ జేఏసీ ఆవిర్భవించింది కదా.. మరిప్పుడు ఏం జరగబోతున్నది..? అని ప్రశ్నించిన మీడియానుద్దేశించి జానా మాట్లాడుతూ ‘అప్పుడు తెలంగాణకు బలమైన ఉద్యమం వచ్చినట్లే ఇక్కడినుంచే బలమైన పాలన తెలంగాణ ప్రజలకు సాధ్యమవుతుంది’ అంటూ వెళ్లిపోయారు.
తెలంగాణ వసరుల దోపిడీకి కుట్ర:ఎంపీ మధుయాష్కీ, టీజీఓ అధ్యక్షుడు వ్రీనివాస్‌గౌడ్
ఆస్తులు కాజేసి అప్పులను తెలంగాణపై రుద్దే కుట్రలకు సీమాంధ్ర నేతలు తెరలేపారని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమైన తరుణంలో అప్పులను మిగిల్చాలనే కుట్రలతోనే ముసాయిదాలో అభ్యంతకరమైన అంశాలను పొందుపర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్రకు అన్యాయం అంటూ తెలంగాణ వనరులను దోపిడీ చేసేందుకు అక్కడి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జీవోఎంలో లేని అంశాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణ భవిష్యత్ ప్రజా ప్రతినిధులపైనే ఉందని టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బిల్లులో ఆంక్షలు పెట్టి తెలంగాణకు కొత్తగా ఉద్యోగాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశా

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.