ఆర్టీసీని గ్రేటర్‌లో విలీనం చేస్తే ఊరుకోం: హరీష్‌రావు

హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలిపితే ఊరుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రెండవ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆయన తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన సంస్థ టీఎంయూ అని కొనియాడారు. ప్రారంభించిన 13 నెలల్లోనే టీఎంయూ గుర్తింపు పొందిందని తెలిపారు. జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలపాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు. దీన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు. ఏ కార్మిక సంఘం కూడా ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోదని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.