ఆర్టిస్టులకున్న సోయి తెలంగాణవాదులకేది?

తమ పొట్టకొడుతున్న డబ్బింగ్ సీరియళ్లను నిషేధించాలని టీవీ ఆర్టిస్టులు పోరాటం చేస్తున్నరు. తమ న్యాయమైన కోరికను పట్టించుకోని టీవీ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఎన్నిసార్లు బతిమిలాడినా వినకపోవడంతో నిన్న మా టీవీ కార్యాలయంపై దాడి చేసిన్రు. రగులుతున్న కడుపుమంటను దాడి రూపంలో వెళ్లగక్కిన్రు.

ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న సీమాంధ్ర మీడియా చానళ్లపై తెలంగాణవాదులు కూడా అనేకానేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. కానీ ఏనాడూ దాడిచేసిన పాపాన పోలేదు. హెచ్చరికలకు సీమాంధ్ర చానళ్లు లొంగవని అర్థం చేసులేకపోయిన్రు. వాటిపంథాలో అవి తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతూనే ఉన్నరు. సడక్ బంద్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయినా అట్టర్ ప్లాప్ అంటూ రాసిన ఎన్ టీవీ, ఐన్యూస్ లను ఏమీ చేయలేకపోయిన్రు. చివరికి జయశంకర్ సార్ మీద తప్పుడు వార్తలు రాసినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉద్యకారులున్నరు. టీవీ ఆర్టిస్టులకు ఉన్న సోయి తెలంగాణవాదులకు లేకుండాపోయింది.  తెగిస్తేనే తెలంగాణ.. తిరగబడి తంతేనే ఎవరైనా వింటరు. టీవీ ఆర్టిస్టుల తెగింపునకు పోరుతెలంగాణ హ్యాట్సాఫ్..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.