హైదరాబాద్: ఆర్టికల్-3 ప్రకారం రాష్ర్టానికి వచ్చిన బిల్లుపై ఓటింగ్‌కు తావులేదని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ బిల్లుపై కేవలం అభిప్రాయం చెప్పమని మాత్రమే రాష్ట్రపతి రాష్ర్టానికి బిల్లును పంపారని ఆయన అన్నారు. కేవలం అభిప్రాయం తెలుసుకునే వరకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. ఆర్టికల్-3 ప్రకారమే బిల్లుపై చర్చ ముగిసిందని, చర్చల వివరాలను త్వరలో రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించారు. రూల్-77 ప్రకారం జరిగిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ రూల్ శాసనసభ వ్యవహారాలకు సంబంధించింది మాత్రమే అని తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై ఇక్కడ జరిగినంత చర్చ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలలో కూడా జరగలేదన్నారు.
ఆర్టికల్-3లో ఓటింగ్‌కు తావులేదు: భట్టివిక్రమార్క
Posted on January 30, 2014
This entry was posted in TELANGANA NEWS, Top Stories.