ఆమ్‌ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆమ్‌ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మద్దతు లేఖను కాంగ్రెస్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపింది. ఆమ్‌ఆద్మీకి 28, కాంగ్రెస్‌కు 8 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. బీజేపీ 31 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే రేపు ఉదయం 10.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.