ఆనాడే తెలంగాణ ఇచ్చుంటే వెయ్యి మంది పిల్లలు బతికుండేవారు -కేసీఆర్

కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 13 సంవత్సరాలుగా గోసపెట్టిందని, వెయ్యిమంది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుందన్నారు. అనాడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే వెయ్యిమంది ప్రాణాలు పోయేవి కాదన్నారు. ఇప్పుడు వారి ప్రాణాలు తీసుకురాగలరా? అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. మెదక్ జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్‌డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన సభ, అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
బాబు నైజం బట్టబయలైంది..
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరు కారాదన్న టీడీపీ నిర్ణయంతో చంద్రబాబునాయుడు నైజం మరోసారి బైటపడిందన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అంశంపై సమావేశం ఏర్పాటు చేస్తే దానికి హాజరై తన వైఖరేదో చెప్పకపోవడం విస్మయకరమన్నారు. తెలంగాణపై చంద్రబాబులో ఎంత విషం దాగుందో తేలిపోయిందన్నారు. ‘నీ మర్మం ఏంటో అర్థమైపోయింది… తెలంగాణ తెలుగుదేశం దద్దమ్మలు మాత్రం ఇంకా బాబును పట్టుకుని వేలాడుతున్నారు…’ అని కేసీఆర్ అన్నారు.

అసెంబ్లీ వద్ద ఫై ్లఓవర్ ఆపేయాలి..
హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ వారు వారసత్వ సంపదను నాశనం చేసే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొజాంజాహిమ్కాట్, అసెంబ్లీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నిర్మాణాల వల్ల తెలంగాణ ప్రజలు తమ వారసత్వ సంపదను కోల్పోయే ప్రమాదముందని, తమ సూచనలు లెక్కచేయకుండా ఎల్ అండ్ టీ కంపెనీ వారు పనులను కొనసాగిస్తే తదుపరి పరిణామాలకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎల్ అండ్ టీ కంపెనీ వద్ద ముడుపులు తీసుకుని నోరు మెదపడం లేదని ఆరోపించారు. తెలంగాణ రైతాంగంపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి వివక్ష చూపుతున్నారని అన్నారు. కోస్తాంవూధలోని కొబ్బరి చెట్టుకు ఇచ్చిన విలువ తెలంగాణ మక్కలకు ఇవ్వడం లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ జిల్లాల్లో బృందాలు పర్యటించి పంటనష్టంపై గవర్నర్‌కు నివేదికలు అందజేసినట్టు తెలిపారు.

‘సుభిక్ష’ తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర స్వప్నం త్వరలోనే సాకారం కాబోతున్నదని, విభజన అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని ‘సుభిక్ష’ తెలంగాణగా తీర్చిదిద్దడమే టీఆర్‌ఎస్ ముందున్న తక్షణ కర్తవ్యమని టీఆర్‌ఎస్ అధినేత స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతమైన భూములున్నాయని, సాగునీరందిస్తే రైతన్నలు కష్టించి సిరులు పండిస్తారన్నారు. రాబోయే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరందించే దిశగా నీటిపారుదలశాఖ నిపుణులతో చర్చిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మొత్తం తెలంగాణను పచ్చని తెలంగాణగా తీర్చుదిద్దుకుంటామని, అభివృద్ధిలో అదర్శ రాష్ట్రంగా మలుచుకుందామని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 40 చెక్‌డ్యామ్‌లను నిర్మించామని, వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర పాలకులు ఇష్టమొచ్చినట్టు అనుమతులిచ్చి అస్తవ్యవస్తం చేశారని, నగరంలో ట్రాఫిక్ పురుగులు పారినట్టుగా తయారైందన్నారు. నగరానికి వంద కిలోమీటర్ల పరిధిలో అద్భుతమైన శాటిలైట్ టౌన్ షిప్‌లు, చక్కని రోడ్లు నిర్మించుకుని నిజమైన అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తామన్నారు. వంద కిలోమీటర్ల చుట్టూ లైట్ రైల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌తో నగరాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు కేవలం 24 నిమిషాల్లో చేరుతామన్నారు. పేదలకు కట్టిస్తున్న ఇండ్ల నిర్మాణంలో విప్లవాత్మకమై మార్పులు తెస్తామని, పేదవారు అత్మాభిమానంతో బతికేలా రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాలు, ఒక కిచెన్, బాత్‌రూమ్, లాట్రిన్‌లతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి 5 శాసనసభ నియోజకవర్గాలకు ఒక జిల్లాగా 24 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సిద్దిపేటకు ఎంతిచ్చినా తక్కువే…!
‘మీరంతా నన్ను తెలంగాణకు ఇచ్చిండ్లు… ఇక్కన్నుంచి పోయేటప్పుడు సిద్దిపేటలోని ఒక హాల్ మీటింగ్ పెట్టినప్పుడు నేనూ ఏడ్చినా, మీరంతా బాధపడ్డరు…కానీ మీ దీవెన, కొనాయిపల్లి వేంక ఆశీర్వాదంతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను గడ్డకు చేర్చింది… ఇలాంటి గొప్ప సందర్భం, అవకాశం సిద్దిపేటకు మాత్రమే దక్కింది. ఆ కీర్తి, ప్రతిష్ట కేసీఆర్‌ను పెంచి, పోషించి, తయారు చేసి తెలంగాణ అప్పగించిన సిద్దిపేట ప్రజలదే’నని కేసీఆర్ ఉద్వేగంగా అన్నారు. సిద్దిపేటకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, మీరు నన్ను తెలంగాణకు ఇచ్చిండ్లు కాబట్టి తెలంగాణ ఇవ్వాళ సిద్దిపేటకు ఎంత ఇచ్చినా తక్కువేనన్నారు. సిద్దిపేటకు సాగు కోసం గోదావరి జలాలలు రప్పించిన తరువాతే మళ్లీ ఇక్కడి వస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వల్లంపట్ల నుంచి కేవలం 16 కి.మీ. లిఫ్ట్‌ద్వారా గోదావరి జలాలను తరలిస్తే సిద్దిపేట శివారులోని తడ్కపల్లికి చేరుతాయని, ఇక్కడి 35 నుంచి 40 టీఎమ్‌సీల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు వస్తుందని, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అక్కెనపల్లి వాగు చెక్‌డ్యామ్‌లు పునాది మాత్రమేనని రేపటి పచ్చటి తెలంగాణకు ఇది మార్గదర్శనమన్నారు. హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌డ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రమణాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, పద్మాదేవేందర్‌డ్డి, కొత్త ప్రభాకర్‌డ్డి, ఆర్.సత్యనారాయణ, రామలింగాడ్డి, రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.