ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచాం-కడియం

రాష్ట్రంలోని రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు చర్చించింది. అనంతరం డిప్యూటీ సీఎం కడియం మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.  రైతుల ఆత్మహత్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. రైతులు అధైర్యపడకుండా కష్టాలను ఎదుర్కోవాలి. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రైతులను ఆదుకునేందుకు అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జిల్లాల వారీగా రైతు ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరిహారం పెంచాం. 

గతంలో లక్షా యాభై వేల రూపాయాలు పరిహారం ఇచ్చేవారు. నేటి నుంచి రూ. 6 లక్షలు పరిహారం ఇస్తాం. ఇందులో రూ. 5 లక్షలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇస్తాం. మిగతా లక్షా రూపాయాలు రైతు చేసిన అప్పులు కడుతాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆదుకుంటాం. పెంచిన పరిహారం నేటి నుంచే అమల్లోకి వస్తుంది.   వచ్చే ఏప్రిల్ 1 నుంచి పగటిపూట 9 గంటల కరెంట్ రైతులకు సరఫరా చేస్తామన్నారు. సెప్టెంబర్ 30 తర్వాత కరువు మండలాలను ప్రకటిస్తాం.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.