ఆజాద్ ఇంట్లో ఎన్టీవీ చౌదరి.. మీడియాకు కిరికిరి

వారం రోజులుగా బాసుల టార్చర్ ను తట్టుకుని ఆదివారం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న ఢిల్లీ రిపోర్టర్లకు.. ఎన్ టీవీ చైర్మన్ ఆదేశం మేరకు ఆ చానల్ రిపోర్టర్ ఫోన్ చేసిండు. ఆజాద్ తెలుగు మీడియాతో మాట్లాడుతాడట రమ్మని.. మీడియా  ప్రతినిధులంతా  ఆగమేఘాల మీద ఆజాద్ ఇంటికి ఉరికిన్రు. తీరా అందరు ఆజాద్ ఇంటికి పోయేసరికి అక్కడ ఎన్టీవీ చౌదరి, షబ్బీర్ అలీ ఉన్నరు. నరేంద్ర చౌదరి గులాంనబీ ఆజాద్ తో తెలంగాణపై ఒక ప్రకటన ఇప్పిస్తరని మీడియా ప్రతినిధులకు తెలిసింది. ఆజాద్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు జరిగినయట. కానీ చివరి నిమిషంలో ఆజాద్ ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేసుకున్నడు. ఇందుకు  కారణం మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటమిపాలవుతమని టీ నేతలు దిగ్విజయ్ కి చెప్పడమే అని పలువురు అనుకుంటున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to ఆజాద్ ఇంట్లో ఎన్టీవీ చౌదరి.. మీడియాకు కిరికిరి

  1. chandu says:

    adhi vishyam modata Telanagan gurunchi Congress forward avuthunattu kathanalu prasarm chesindhi kuda N TV ye