ఆంధ్రోళ్ల ఆటలు ఇంకెంతకాలం సాగనివ్వం-కేసీఆర్‌

 

KCR-R
-ఆంధ్రా తోకన్న రాజ్యాలు మనకొద్దు
-మన రాష్టం తెచ్చుకుందామని పిలుపు
– సర్కారీ ఇళ్లపై అప్పులు కట్టొద్దు
– తెలంగాణ రాష్ట్రంలో అన్నీ మాఫీ చేస్తాం
– వివిధ వర్గాలకు భారీ మొత్తంలో పింఛన్లు
– అన్ని హంగులతో పక్కా ఇళ్లు
– ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు
– మౌలాలి సమరభేరి సభలో కేసీఆర్ హామీలు
‘‘సొమ్ము మాది.. సోకు మీది. ఇది ఇంకెంత కాలం? ఇక సాగనీయబోం’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు సీమాంధ్ర పాలకులను హెచ్చరించారు. పాదయావూతలతో మాయామశ్చీంద్ర విద్యలు చేస్తున్న ఆంధ్రా తోకన్న రాజ్యాలు ఇకపై మనకొద్దని, తెలంగాణ రాష్ట్రం కోసం సమిష్టిగా కృషిచేద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కొనసాగిన పోరాటానికి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటించినా, రాజీనామాల డ్రామా ఆడిన ఆంధ్రాపార్టీలు తెలంగాణ గడ్డమీద ఇంకా అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. సొంత పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా బతికే ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. వివిధ వర్గాలకు పింఛన్లు, గృహాలు ఇస్తామని, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేయ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని మౌలాలి కమాన్ వద్ద జరిగిన సమరభేరి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మల్కాజిగిరి నియోజకవర్గం నాయకుడు చింతల కనకాడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శులు మేకల సారంగపాణి, గొల్లూరి అంజయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, రంగాడ్డి జిల్లా (తూర్పు) అధ్యక్షుడు పుటం పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ఇప్ప శ్రీనివాసడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి చాడ సురేష్‌డ్డి, టీఆర్‌ఎస్ అసెంబ్లీ ఇన్‌చార్జి బద్దం పరశురాండ్డి, మహిళా నాయకురాలు లావణ్య, దీన తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సొమ్మును ఆంధ్రాకు దోచిపెడుతున్నారని, ఎవని సొమ్ము ఎవడు తింటున్నడు, మీరు (ఆంధ్రా) పోతే మేము దర్జాగా బతుకుతామన్నారు. ‘‘తెలంగాణ సొంత రాష్ట్రమే. కొత్త రాష్ట్రాన్ని అడుగుతలేము. 1948 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఆనాటి తెలంగాణ రాష్ట్రానికి రూ.63కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల స్కేలు ఆంధ్రా ఉద్యోగుల స్కేలు కంటే ఎక్కువ. నీదగ్గర (ఆంవూధాలో) అంతా మంచిగా ఉంటే ఇక్కడికి (తెలంగాణకు) ఎందుకు వచ్చినవ్’’ అని నిలదీశారు. ‘‘తిమ్మిని బమ్మిని చేసి, ఉల్టా పల్టా చేసి మాట్లాడుతున్నరు. మా హైదరాబాద్ అంటే బిర్యానీ, షేర్వానీ, కుర్బానీ.. మా హైదరాబాద్ బిర్యానీ, కుర్బానీ మీ మొఖాలకు చేయొస్తదా ? మీరు బిర్యానీ చేస్తే పెండలా ఉంటది. మీరు ఉలువచారు గురించి మాట్లాడుతున్నరు. మేము ఇక్కడ ఉలువలను పశువులకు దానాగా పెడతాం’’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు ప్రభుత్వ శాఖల నుంచి ప్రధానంగా ఆదాయం వస్తుంది.

ఇందులో వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ శాఖ, రవాణా శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలు కలిపితే 2011-12 ఆర్థిక సంవత్సరానికి రూ.39,900కోట్లు తెలంగాణ నుంచి వస్తే, సీమాంధ్ర ప్రాంతాల నుంచి రూ.13,177కోట్లు వచ్చిందని కిరణ్ ప్రభుత్వమే చెప్పిందని తెలిపారు. దీన్నిబట్టి ఎవడి సొమ్ము ఎవడు తింటున్నడో అర్థం అవుతుందన్నారు. మన దగ్గరనుంచి 40వేల కోట్లను దండుకుంటూ, మనకే బిచ్చమేసినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు (ఆంధ్రా) పోతే మేము దర్జాగా బతుకుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘జగన్ పార్టీ రూ.500 పింఛను ఇస్తానంటుంది. చంద్రబాబు రూ.600 పింఛన్లు ఇస్తానంటుండు. కేసీఆర్‌గా నేను చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తా. వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తా. పేదలకు పక్కా గృహాలకు రూ.2లక్షలు కేటాయించి డబుల్ బెడ్ రూం పోర్షన్లు కట్టించి ఇస్తా’’ అని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ప్రభుత్వ సబ్సిడీ, రుణాలతో ఇళ్లు నిర్మించుకున్నవారు రుణాలను కట్టవద్దని సూచించారు. పేదల ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో సొమ్ము ఎవరిదీ? నీళ్లు మనవి, సింగరేణి బొగ్గు మనది. పరాయి పాలనలో చిక్కి బాధపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఒక్కొక్క జిల్లాది ఒక్కొక్క బాధ అంటూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రతను కేసీఆర్ వివరించారు. నల్లగొండలో చందమామలాంటి పిల్లలు ఫ్లోరోసిస్ బారినపడి అవస్థలు పడుతున్నరు. నేను కూడా నల్లగొండకు వెళ్లి పరిస్థితులు చూసి ఏడ్చినా. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా కనీసం తాగేందుకు నీళ్లు కూడా అందించడంలేదని మండిపడ్డారు. సాగర్ నిర్మాణంలో 264 లంబాడీ తండాలు మునిగిపోయాయని తెలిపారు. ఈ బాధ ఎందుకు ? ఎవరి కోసం అనుభవిస్తున్నం? కృష్ణా నీళ్లలో మనకు వాటా లేదా? రాజ్యాంగ రక్షణ లేదా? మనం ఈ దేశంలో భాగం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 55 ఏళ్ల సమైక్య పాలన చూశాం.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మనకు ఏమైనా చేశాయా? తెలంగాణలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి. చేనేత కార్మికులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నరు. మన మోచేతికి బెల్లం పెట్టి నాకాలంటున్నారు. మా సొమ్ము మీరు ఇచ్చేదేందీ.. మాది మేమే తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు ఏళ్లుగా టీఆర్‌ఎస్ పోరాటం చేస్తోంది. కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులకు లోనై పార్టీకోసం పనిచేస్తున్నరు. అనేక మంది దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. నేను కూడా చావునోట్లో తలకాయ పెట్టినా. ఎంతో మంది నన్ను ఆమరణ దీక్ష విరమించమని బతిమిలాడారు. ఒక్కటే ఒక్కరోజు ఆత్మబలంతో బతుకుతానని మొండిగా ఉన్నాను. డిసెంబర్ 9న రాత్రి 11.20గంటలకు ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చింది.

57ఏళ్ల పోరాటానికి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. రాత్రి ప్రకటన వస్తే ఉదయం ఎనిమిదిన్నర గంటలకల్లా ఆంధ్రా పార్టీలు రాజీనామాల డ్రామా ఆడాయి. ఆంధ్రా జీవులనీ ఒక్కటైనాయి. చంద్రబాబుది నాలికనా?తాటి మట్టనా? ఇంత మోసమా? ఇంత దగానా? తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీలు అవసరమా? అని కేసీఆర్ ఆవేశంతో వ్యాఖ్యానించగా సభికులు అవసరం లేదంటూ చేతులు ఎత్తారు. ‘‘తెలంగాణ కోసం అన్ని ఉద్యమాలు చేసినం. నేను ఆమరణ దీక్ష చేసిన, 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేసినం, విద్యార్థులు ఉద్యమాలు చేస్తే ఆంధ్రాపోలీసులు కనికరం లేకుండా కొట్టిండ్రు, అనేక మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నరు. ఇక చాలు.. మన శక్తిని చూపెట్టే తరుణం ఆసన్నమైంద’’ని అన్నారు. ‘‘వచ్చిన తెలంగాణను రాజీనామాలతో అడ్డుకున్న సీమాంధ్ర పార్టీల వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి తెలంగాణలోని అన్ని పార్టీల ప్రతినిధులు రాజీనామాలు చేయాలని తేదీ నిర్ణయం చేసుకుని అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులర్పించి అక్కడినుంచి అసెంబ్లీకి వెళ్ళి రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. కాంగ్రెస్, తెలుగుదేశం దద్దమ్మలు, చవటలు, సన్నాసులు తెలంగాణ ఇజ్జత్ తీశారు’’ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చవట దద్దమ్మలను మళ్లీ గెలిపిద్దామా? 17 మంది ఎమ్మెల్యేలుంటే అసెంబ్లీని నడువనీయలేదు, నూరు మంది గులాబీ కండువలతో అసెంబ్లీకి వెళితే ఆంధ్రావాడు అసెంబ్లీకి వస్తాడా? ఇద్దరం ఎంపీలున్న మేము (కేసీఆర్, విజయశాంతి) పార్లమెంటుకు వెళ్తే వారంరోజులు పార్లమెంటు నడువలేదు. 150 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుచేయాల్సిందేనని కోరారని తెలిపారు.

తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రధానమంత్రి ఎవరుండాలో నిర్ణయించేది మనమే, కేంద్రంలో కీలక నిర్ణయాలు తీసుకునేది మనమే, ఢిల్లీని శాసిద్దామా? అసెంబ్లీని శాసిద్దామా? ఈ విషయంలో తెలంగాణ ప్రజలు నిర్ణయం చేయాలి, గీత గీయాలని కోరారు. అర్థం అయినప్పుడు అర్థం కానట్లు నటిస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. ‘‘పన్నెండేళ్ల నుంచి పోరాడుతున్నం, తల తెగినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రాకుండా ఉద్యమ విరమణ జరిగితే ఆంధ్రావాళ్లు మనల్ని పాతాళంలోకి తొక్కుతరు, కంటికి పంటికి అందకుండా మింగుతరు, అప్పుడు మనం ఇంకా కట్టుబానిసల్లా బతకాలి, ఈ తరం తెలంగాణను ఓడిపోయేట్లు చేయొద్దు, చంద్రన్న, రాజన్నల రాజ్యం కాదు, మన రాజ్యం మన తెలంగాణ రాజ్యం కావాలి’’ అన్నారు. మనకు ఇజ్జత్ ఉంది, చంద్రబాబుకు లేదు, ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను అరెస్టు చేయించిండ్రు, కరెంటు దొంగతనం చేస్తే ఉరితీయాలన్నడు, ఇయ్యాల చంద్రబాబు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు దీక్ష చేయడానికి వస్తనంటున్నడు, ఆయన పాలనలో కరెంటు బిల్లు భారానికి కాసుల సదానందం అనే రైతు చంద్రబాబు మీదనే లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ తప్పునకు తనదే బాధ్యత అని చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి జమ్మికుంటకు వెళ్లాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

తన హయాంలోనే కూకట్‌పల్లిలో ఇందు ప్రాజెక్టు భూములు కేటాయించిన చంద్రబాబు వాటిపై ఆరోపణలు చేస్తుండు, దీనిపై ఒక పత్రిక ఆయన ఫొటోలు అచ్చువేసింది, ఇదేందని నేను అడిగితే అప్పటిది జనం ఇంకా గుర్తుంచుకుంటారా? అని ఆ పత్రికాయన నాతో చెప్పాడని తెలిపారు. జగన్, చంద్రబాబు పార్టీలు ఆపదమొక్కుల ప్రచారం చేస్తున్నాయి, చంద్రబాబు లంబాడి తండాకు వెళ్లి నేనే పెద్ద నాయక్ అని, ఎస్సీ కాలనీకి వెళ్ళి నేనే పెద్ద మాదిగనని చెప్పుకుంటుండు, చంద్రబాబు ఏదైనా చెబుతాడు, ఆల్ ఫ్రీ బాబు అయ్యిండని కేసీఆర్ విమర్శించారు. ముస్లింలకు తెలంగాణలో విపరీతమైన సంపద ఉంది, చంద్రబాబు, వైఎస్‌ఆర్‌లు వక్ఫ్‌బోర్డు భూములను అన్యాక్షికాంతం చేశారని కేసీఆర్ ఆరోపించారు. నేడు ముస్లిం సోదరులు సొంత ఇంటిలోనే పరాయివాళ్లుగా బతికే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముస్లిం సోదరులు కలిసిరావాలని కోరారు. ఇదే చంద్రబాబు, వైఎస్ రాజశేఖరడ్డి వక్ఫ్‌బోర్డు భూములను లగడపాటి రాజగోపాల్ ల్యాంకో హిల్స్‌కు కేటాయించారని, వాటిపై తాను కోర్టుకు వెళ్ళి కేసులు దాఖలు చేశానని, ఆ భూములు వెనక్కి తీసుకుందామని ముస్లింలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.