ఆంధ్రా ఫెల్లోస్ కేరాఫ్ డేరా నగర్

tg1

ఆంధ్రవూపదేశ్‌లో ‘డేరా నగర్’ అనే ప్రాంతం పేరు ప్రస్తుత తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు! ఒక విశాలమైన ఖాళీ ప్రాంతంలో వేసిన డేరాల సముదాయమే ఒకప్పుడు రాష్ట్ర పరిపాలనా కేంద్రమంటే ఈ తరం వారికి ఆశ్చర్యం కల్గించవచ్చు! కానీ.. ఇది నిజం! ఆచరణ సాధ్యం కాని మద్రాస్ నగరం కోసం పట్టుబట్టి.. అది ఫలించకపోవడంతో రాత్రికి రాత్రే మద్రాస్ నగరంనుంచి తట్టాబుట్టల్లో ఫైళ్లు కట్టలు కట్టుకుని కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసుకున్న ఆంధ్ర ప్రాంత దుస్థితి ఇది! అప్పటికే భారీ భవంతులతో సకల సదుపాయాలతో దేశంలోనే అన్ని హంగులూ ఉన్న ఒక నగరంగా ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్‌పై ఆంధ్ర ప్రాంత నేతల కన్నుపడిన నేపథ్యానికి ఈ డేరానగర్ సాక్షీభూతం! 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడినతర్వాత ఆ ప్రాంతానికి రాజధాని లేకపోవడంతో కర్నూలు పట్టణాన్ని రాజధానిగా ఎంచుకున్నారు.
kurnool-tents-9
రాయలసీమ, కోస్తా నేతల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఏర్పాటు జరిగింది. రాజధాని నిర్వహణకు సరిపడే భవంతులేవీ లేకపోవడంతో కర్నూలులోని ఒక ఖాళీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుడారాలు వేశారు. వాటిలోనే సచివాలయం, వాటిలోనే అసెంబ్లీ సాగాయి. వివిధ శాఖల కార్యాలయాలు డేరాలే.. వాటి అధిపతులు, సిబ్బంది నివాసాలుడేరాలే! అందుకే ఈ ప్రాంతానికి డేరానగర్‌గా పేరు వచ్చింది. సరైన పారిశుధ్యం కొరవడి, రోడ్లు లేక, వర్షం వస్తే బురదగా మారే పరిసరాలతో ఆంధ్ర పాలకులు నానా అవస్థలు పడ్డారు. పాములకు, తేళ్లకు పుట్టిల్లుగా ఆంధ్ర రాష్ట్ర రాజ్‌భవన్ ప్రాంతంతయారైందని వార్తలు కూడా వచ్చాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక డేరాలపై నీళ్లు చల్లేవారు. డేరాల్లో వాడిని మురుగునీరు బయటికి పోయేందుకు సిమెంటుతో భూమిలోపల పెద్ద పెద్ద గుంతలు నిర్మించారు. ఒక సమయంలో నాటి గవర్నర్ త్రివేదీ ఈ డేరానగర్‌ను సందర్శించి, సిమెంటుతో నిర్మించిన గుంతలన్నీ నిండిపోయి ఉండటాన్ని గమనించి.. వాటిని శుభ్రం చేసేందుకు పలు సూచనలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిని కర్నూలు పట్టణంలో మూడేళ్లు నెట్టుకొచ్చిన ఆంధ్ర ప్రాంత నేలు రాజధానిని ఇంక ఏమాత్రం ఇక్కడ కొసాగించే వీలు లేదని అభివూపాయానికి వచ్చారు.
kurnool-tents-1
ఆ సమయంలోనే వారి కన్ను హైదరాబాద్ నగరంపై పడింది. పర్యవసానమే విశాలాంధ్ర నినాదం పుట్టుకొచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పేరుతో తెలంగాణను ఎస్సార్సీ సిఫారసులకు వ్యతిరేకంగా కలిపేసుకుని.. హైదరాబాద్ భవంతుల్లోకి పరిపాలనను మార్చారు. తాము హైదరాబాద్‌కు ఏ నేపథ్యంలో వచ్చామన్న సంగతిని విస్మరించిన ఆంధ్ర నేతలు.. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు పోవడం విచివూతమే మరి!!
kurnool-tents-61a

This entry was posted in ARTICLES.

Comments are closed.