ఆంధ్రా గొట్టాలు.. అబద్ధపు ప్రచారాలు

రోడ్డు పక్క స్నానాలు చేయించి నాయకులను సష్టించే పత్రికలు ఇపుడు తెలంగాణ మీద మైండ్‌గేమ్ ఆడి రాక్షసానందం పొందుతున్నాయి. ఒకదాని వెనక ఒకటిగా తెలంగాణ అనుకూల పరిణామాలు వేగంగా సాగుతున్న సమయంలోనూ వ్యతిరేక వార్తలతో కుళ్లు బయట పెట్టుకుంటున్నాయి. కళ్లముందు జరుగుతున్నదొకటి ప్రసారం చేస్తున్నదొకటి. మేం చెప్పేదే వార్త అన్నట్టు… మేం చూపేదే నిజం అన్నట్టు ఇష్టారాజ్యపు వక్రీకరణలు. అధికార ప్రతిపక్ష సభ్యుల రాజకీయటెత్తుగడల సంభాషణల తీరుతెన్నుల లోతులెరుగని అజ్ఞానం ఇపుడు ఢిల్లీ పార్లమెంటు వద్ద రిపోర్టర్ల గొట్టాలనుంచి అంతరిక్షపు ఉపగ్రహాల రిసీవర్లను తాకి పరావర్తనమై రంగుడబ్బాలకు ప్రవహిస్తున్నది. అవును!.. సీమాంధ్ర మీడియా అజ్ఞానం ఇపుడు అంతరిక్షాన్నీ కలుషితం చేస్తున్నది!

కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కతనిశ్చయంతో ముం దుకు సాగుతుండగా సీమాంధ్ర నాయకులు మైం డ్‌గేమ్‌తో రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సష్టిస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించి 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచటం ఖాయమని కేంద్రంలో రాజకీయ, అధికార వర్గాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నా యి. బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అ న్ని విధాల సహకరిస్తామని విస్పష్టంగా ప్రకటించింది. అయినా ఆ పార్టీ వెనుకంజ వేస్తుందని దిక్కుమాలిన కలలు కనే సీమాంధ్ర మీడియా తాననుకున్న వైఖరిని ఆ పార్టీ నేతల్లో భూతద్దం వేసి వెతుకుతూ ప్రతికూలతలను పిండుతున్నది. పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న ఏ దేశంలో అయినా ప్రతిపక్షం అంటే అధికార పార్టీకి చెక్కభజన చేయదు.

అధికార ప్రతిపక్ష నాయకులు ఎంత సానుకూల అంశం మీదైనా భుజాల మీద చేతులు వేసుకుని ఫోజులివ్వరు. మద్దతు ఇచ్చే సమయంలోనూ ఏదో ఒక తప్పును ప్రతిపక్షం ఎత్తిచూపి మందలించడం సాధారణం. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేని సీమాంధ్ర మీడియా ప్రతిపక్ష సూచనల్లో కూడా వ్యతిరేకత వెతికిపట్టుకుని ప్రసారాలు చేసింది. సహజంగానే దెబ్బతిన్న వారు కావడంతో ఈ మైండ్ గేమ్‌తో తెలంగాణవాదుల్లో ఈ ప్రసారాలు ఆందోళన కలిగించాయి. సో మవారం నాడు బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయు డు మాట్లాడిన విషయాలను సీమాంధ్ర మీడియా తనకు నచ్చినట్టు వక్రీకరించింది.

దీనితో తెలంగాణ మేధావులు ముందుకు వచ్చి మీడియా ఉచ్ఛులో పడి ప్రాణాలు తీసుకోకూడదని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే సీమాంధ్రకు కాంగ్రెస్ నాయకుల వాచాలతను గోరంతలు కొండంతలుగా చూపిస్తూ సీమాంధ్ర మీడియా తాత్కాలిక ఆనందం పొందుతోంది. మొన్నటిదాకా సీఎం దగ్గర బాలు…బాలు… అంటూ ప్రసారాలు చేసి చేసి ఇపుడు బ్రహ్మాస్త్రం అంటూ పల్లవి ఎత్తుకుంది. ఇక బిల్లు తిరస్కారం, బీజేపీ అడ్డుపుల్ల అంటూ పతాక శీర్షికల కథనాలను ప్రచురిస్తూ తెలంగాణప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది. బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ పలు సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. పార్లమెంటులో గంటకు పైగా ప్రసంగించారు.

తెలంగాణలో ఆమెకు క్షీరాభిషేకాలు కూడా చేశారు. స్వయంగా బతుకమ్మ ఎత్తుకుని తెలంగాణ తల్లిగా పిలిపించుకున్న సుష్మ అధికార పార్టీ తెలంగాణ వైఖరిలో చేస్తున్న పొరబాట్లు ఎత్తి చూపుతూ మాట్లాడిన మాటలను సీమాంధ్ర మీడియా ఇక అయిపోయింది అన్నట్టు ప్రసారం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సుష్మాస్వరాజ్ వాస్తవ పరిస్థితిని చర్చించారు. దానిని సీమాంధ్ర మీడియా చిలవలు పలవలు చేర్చి ప్రసారం చేసిం ది.

పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించాలని, తన పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కట్టడి చేయాలని చెప్పారు అంతే తప్ప పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తామనలేదు. పైగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సమయం ఆసన్నమైందని కూడా అన్నారు. ఇక వెంకయ్యనాయుడు ప్రసంగానికి సీమాంధ్ర మీడియా సొంత భాష్యాలు జోడించింది. సీమాంధ్ర ప్రాంత సమస్యలను పట్టించుకోవాల్సి ఉంటుందని ఆయన చేసిన ప్రసంగాన్ని తెలంగాణకు వ్యతిరేకమంటూ ప్రసారం చేసింది.

ఇంతకూ ఆగిందెప్పుడు?..
కేంద్రం తెలంగాణ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఏ దశలోనూ అడ్డంకి లేకుండా ముందుకు సాగింది. కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చిన వెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అదేరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది. తరువాతి దశలో బిల్లుకు రూపకల్పన జరిపి కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బీజేపీని సంప్రదించి రాయల తెలంగాణ ప్రతిపాదనను తొలగించింది.

తరువాత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించి ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వీలైనంత త్వరగా బిల్లును హస్తినకు పంపించాలని ఆదేశిస్తూ రోజువారీ పర్యవేక్షణ జరిపింది. సోమవారంనాడు అసెంబ్లీ అభిప్రాయాలు ఢిల్లీకి వెళ్లగా మంగళవారమే కేంద్ర మంత్రుల బందం భేటీకి ఏర్పాటు చేసింది. ఇంతా శీఘ్రగతిన ఇంత పక్కాగా తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంటే సీమాంధ్ర మీడియా దీనిపై లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ తెలంగాణ ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతోంది.

This entry was posted in CRIME NEWS.

Comments are closed.