ఆంధ్రాలో అరాచకం.. పోలీస్‌ స్టేషన్‌ ముందే జర్నలిస్టుపై దాడి

అది చీరాల పోలీస్‌ స్టేషన్‌.. ఆదివారం మధ్యాహ్నం.. జర్నలిస్టు బైక్‌ను కారుతో గుద్ది.. అతనిపై కర్రలతో దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టు తన్నారు. ఇది ఏదో సినిమాలో సీన్‌ కాదు.. ఆ కొట్టింది ఎవరో వీధి రౌడీలు కాదు. టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు, అనుచరులు..  తమ అక్రమాలను, అవినీతిని బైటపెట్టినందుకు  నాయుడు నాగార్జునరెడ్డి అనే  ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుపై దాడి చేశారు. పట్టపగలు అంతా చూస్తుండగా పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే కర్రలతో కొట్టారు.

చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు, జర్నలిస్టులు, జనం.. అందరిపై రౌడీయిజం చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు తెరలేపుతున్నారు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *