ఆంధ్రాపార్టీల జెండా గద్దెలు తొలగిస్తాం

తెలంగాణపై జాప్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ భరతంపట్టక తప్పదని టీర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యమానికి తలొగ్గకుండా ఏ మాటైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చారో ఆ హామీని నిలుపుకోవాలని, మోసం చేస్తే కాంగ్రెస్ పతనం తప్పదని హెచ్చరించారు. ఒకవైపు టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని ఊరూరా జెండా ఎగురవేస్తూ జబ్బలు చరుచుకుంటుంటే ఆంధ్రా నేతలు ఢిల్లీలో ఆంటోని, అహ్మద్‌ప కలిసినపుడు ‘సీమాంవూధలో ఇంతగొప్ప ఉద్యమం నడుస్తుందా, వైపల్యం చెందాం’ అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని, ఇంతపెద్ద ఇంటలీజెన్స్ వ్యవస్థ ఉన్న వారు నిర్ణయంతీసుకునే ముందు జ్ఞానం లేదా ధ్వజమెత్తారు. 120 రోజుల్లో తెలంగాణ రాబోతుందని చెప్పిన వారు అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర పార్టీలు తమ తప్పుడు ప్రచారం ఆపకపోతే తెలంగాణ జిల్లాలో ఆ పార్టీల గద్దెలు తొలగించి వాటి భరత పడుతామని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.