ఆంధ్రప్రదేశ్ బిల్లు ఆమోదించింది ఇలా..

(సవాల్ రెడ్డి):తెలంగాణ బిల్లు అసెంబ్లీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ ఇక రోజుల్లోనే ఉంది. కేబినెట్ నిర్ణయం, బీజేపీ బేషరతు మద్దతు వ్యక్తమై ఆమోదం లాంఛనవూపాయమైన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. చేయరాని ఘోరమేదో కాంగ్రెస్ చేస్తున్నట్టు, అధిష్ఠానం నిరంకుశంగా నియంతలాగా వ్యవహరిస్తున్నదంటూ ప్రచారాలు చేస్తున్నారు. దీనికి మీడియా వత్తాసు పలుకుతోంది. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాల ఏర్పాటు అంశంలో దృఢంగా వ్యవహరించడం ఇదే ప్రథమం కాదు. స్వాతంవూత్యానంతరం అత్యంత ప్రజాస్వామ్యవాదిగా పేరున్న జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో భాషారాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. బిల్లును వ్యతిరేకించకూడదని ఏఐసీసీ కార్యదర్శి నాడు రాష్ట్ర శాఖలకు హెచ్చరిక జారీ చేశారు. స్వల్ప సవరణలు… అవీ పార్టీ అనుమతితో మాత్రమే చేయాలని నిర్దేశించారు. 1956లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నాటి అధిష్టానం పార్టీ శాఖలకు జారీ చేసిన ఉత్తర్వు ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నది. అలాగే బిల్లుపై చర్చకు కూడా కేంద్రం పెద్ద వ్యవధి ఇవ్వలేదు. మార్చినెలాఖరు నాటికి వివిధ రాష్ట్రాలకు బిల్లులు పంపించిన కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే తేదీ (17)ని ముందే ప్రకటించి ఫిక్స్‌లో పెట్టింది.

రాష్ట్రాల ఏర్పాటు బిల్లు కథా కమామీషు..
స్వాతంవూత్యానంతరం చాలాకాలం కేంద్రం కొత్త రాష్ట్రాల ఏర్పాటు జోలికి పోలేదు. ఒక ప్రత్యేక పరిస్థితిలో ఆంధ్రరాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రాల ఏర్పాటుకు హైలెవల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నెహ్రూ ప్రకటన చేయడంతో రాష్ట్రాల ఏర్పాటుకు అంకురం పడింది. ఆ మేరకు ఏర్పాటైందే ఫజల్ అలీ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ‘స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లు’ను కేంద్రం రూపొందించింది. మొత్తం 15 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు కేంద్రం ఒకే బిల్లు రూపొందించింది. దీనికితోడు దేశాన్ని 5 మండలాలుగా మార్చాలన్న ప్రతిపాదనా చేర్చింది. సరిహద్దు తగాదాల పరిష్కారానికి ఆయా రాష్ట్రాలు కోరినట్టయితే సరిహద్దు సంఘాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. 121 క్లాజులు, 6 షెడ్యూళ్లతో రూపొందించిన ఈ బిల్లును 1956 మార్చి 16న పార్లమెంటు సభ్యుల పరిశీలనకు అందచేసింది. మార్చి 20 నాటికి ఆయా అసెంబ్లీలకు పంపించింది. ఏప్రిల్ 17న పార్లమెంటులో సవరణలతో బిల్లు ఆమోదిస్తామని ప్రకటించింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అక్టోబర్ 1వ తేదీ ముహూర్తంగా నిర్ణయించి ముసాయిదా బిల్లులోనే పొందుపరిచింది. ఈ మేరకు వివిధ అసెంబ్లీల్లో మార్చి 26నుంచి ఏప్రిల్ 12 మధ్య చర్చలు జరిగాయి. మద్రాసు అసెంబ్లీ కేవలం 3 రోజుల చర్చతోనే బిల్లు ఆమోదించింది.

ఆంధ్ర, హైదరాబాద్ అసెంబ్లీల్లో చర్చ..
మార్చి 1-20 మధ్య అటు కర్నూలు, ఇటు హైదరాబాద్‌లకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు(1956) చేరింది. హైదరాబాద్ రాష్ట్రంలో బిల్లును కూలంకశంగా చర్చించి నివేదిక ఇచ్చేందుకు 11 మందితో కమిటీ వేసుకున్నారు. ఈ రాష్ట్రపరిధినుంచి 3 రాష్ట్రాల ఏర్పాటు జరుగుతున్నందున సరిహద్దులు, ఆస్తులు అప్పుల పంపిణీ వంటి క్లిష్ట అంశాలు ఉండడం వల్ల ఇది తప్పని సరి అయింది. ఏ్రప్రిల్ 2 వ తేదీన హైదరాబాద్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. రెండు అసెంబ్లీల్లో చర్చించిన అంశాల్లో రాష్ట్రానికి కొత్తపేరు పెట్టడం, హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన స్థలం, తదితర అంశాలున్నాయి. కొత్త రాష్ట్రానికి ఆంధ్రవూపదేశ్ అనే పేరు ఉంచాలని ఆంధ్ర ప్రభుత్వం అభివూపాయపడితే తెలంగాణలో భిన్నాభివూపాయాలు వచ్చాయి. ఆంధ్ర అసెంబ్లీ ఆంధ్రవూపదేశ్ పేరు ఖాయం చేస్తూ తీర్మానం చేసింది. హైదరాబాద్ ప్రభు త్వం తనకు తానుగా ఏ పేరును సవరణలో పేర్కొనలేదు.

అయితే ప్రతిపక్షపార్టీ ఆంధ్రవూపదేశ్ అనే పేరుతో సవరణ ప్రతిపాదించగా అధికార పార్టీకి చెందిన పాగాపుల్లాడ్డి సమర్థించారు. సవరణ మూజువాణి ఓటుతో నెగ్గింది. హైదరాబాద్ అసెంబ్లీలో బొంబాయి, మైసూరు రాష్ట్రాల పై కూడా చర్చ జరిగింది. బొంబాయి నగరాన్ని కొత్తరాష్ట్రంలో కలపకూడదంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సభ ఖండించింది. నాటి ప్రతిపక్ష నాయకుడు దేశ్‌పాండే మాట్లాడుతూ ‘‘వ్యాపారానికి ఏదో నగరానికి చేరిన వారి కోరికల ప్రకారం ఒక జాతికి చెందిన ఒక నగరాన్ని వారికి కాకుండా చేసిన ఈ మాదిరి ఘటనలు ప్రపంచ చరివూతలో లేవు‘ అన్నారు. ఇక అలంపూర్, కొడంగల్, గద్వాల తాలూకాలు మహబూబ్ నగర్‌లో, నారాయణపేట, జహీరాబాద్ మెదక్ జిల్లాలో చేర్చాలని సూచన వచ్చింది. ఏప్రిల్ 2 నుంచి రెండురోజుల పాటు ప్రధాన చర్చ జరగ్గా 10నుంచి వివిధ క్లాజుల సవరణలపై చర్చ 12వరకూ జరిగింది. ఆంధ్ర అసెంబ్లీలో ఆంధ్ర-తెలంగాణ కొత్త రాష్ట్రంగా పేర్కొనాలా? లేక ఉన్న రాష్ట్రం విస్త్రతమైనది అనాలా అనే అంశంపై ఎక్కువగా చర్చ జరిగింది. కొత్త రాష్ట్రంగా పేర్కొన్న పక్షంలో మధ్యంతర ఎన్నికల్లో ఎన్నికైన తమ పదవీ కాలానికి ఎసరు వస్తుందని భయపడ్డారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ప్రకాశం మంత్రివర్గం కూలిపోవడంతో అక్కడ మధ్యంతర ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ్యులు ఎన్నికయ్యారు. 2వ తేదీన ప్రారంభమైన చర్చ 6వ తేదీతో ముగిసింది.

తీర్మానం ఉండదుగాక ఉండదు…
తెలంగాణ బిల్లు మీద సీమాంధ్రనేతల వాదన పాడిందే పాటరా సామెతను గుర్తు చేస్తున్నది. రాష్ట్రపతి ఇవ్వాల్సిన కాలవ్యవధి విషయంలో, ఇతరత్రా కేంద్రం పాటించాల్సిన విధివిధానాల విషయంలో రాజ్యాంగమో… అంటూ ఆరు నొక్కరాగం తీస్తున్న సీమాంధ్రనేతలు, బిల్లును విమానంలో పంపుతారా? అంటున్న పార్టీల అధ్యక్షులు, కీలకమైన బిల్లు అసెంబ్లీ ప్రక్రియ విషయంలో మాత్రం రాజ్యాంగం ఒకటుం ది..అది కొన్ని పద్దతులు పెట్టింది అనే విషయాన్నే మరిచి పోయి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో పీక పిసికి చంపేస్తారేమో అన్నంత బిల్డప్‌లను మీడియాకూ డా ఇస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో బిల్లుపై కేవలం చర్చమాత్రమే జరు గుతుంది. అదికూడా బిల్లులోని అంశాలపై మాత్రమే. సభ్యు లు బిల్లులో ఉండే వివిధ క్లాజులు, షెడ్యూళ్ల విషయంలో తమతమ అభిప్రా యాలు వెల్లడించవచ్చు. ఈ అభిప్రా యాలను స్పీకర్ కేంద్రా నికి నివేదిక రూపంలో నివేదిస్తారు. కేంద్రం ఈ అభిప్రాయా లన్నింటినీ పరిశీలించి తుది బిల్లు తయారు చేసేసమయంలో సాధ్యాసాధ్యాలను బట్టి చేర్చ డమో, చెత్తబుట్టలో పారేయడమో చేస్తుంది. అంతేతప్ప అసెంబ్లీలో బిల్లును ఆమోదించేందుకు లేదా తిరస్కరిం చేం దుకు అవకాశం లేదు.

సభ్యులు డిమాండ్ చేసినా రాజ్యాంగ ప్రక్రియను బట్టి స్పీకర్ ఈ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టే అవకాశమే లేదు. రాజ్యాంగ నిర్మాతలు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే అసెంబ్లీని అభిప్రాయాలు చెప్పే వరకే పరిమితం చేశారు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలోని గిరిజనులు తమకు రాష్ట్రం కావాలనుకుంటే, అది ఎంత న్యాయబద్దమైనదైనా అసెంబ్లీ ఇష్టాఇష్టాలకు వదిలేస్తే తీర్మా నం ఎన్నటికీ జరగదు. ఎందుకంటే అసెంబ్లీలో గిరిజన ఎమ్మె ల్యేలు పట్టమని పదిమంది కూడా ఉండరు. అలాగే దళితు లు, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం పరిస్థితీ అంతే. నాడు రాజ్యాంగ సభలో మద్రాసు నుంచి ప్రాతినిథ్యం వహించిన సభ్యుడే అసెంబ్లీకి అధికారం ఇవ్వకూడదని వాదించాడు. తమవద్ద ఆంధ్రరాష్ట్ర డిమాండ్ చాలాకాలంగా ఉందని అయితే మద్రాసు అసెంబ్లీలో సంఖ్యాబలం లేదు కాబట్టి నిర్ణయాధికారం అసెంబ్లీకి ఇస్తే ఆంధ్రరాష్ట్ర కల ఎన్నటికీ నెరవేరదన్నాడు. రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాష్ట్రపతికే ఇవ్వాలని వాదించాడు. ఇవాళ ఆ ఆంధ్రరాష్ట్రంనుంచి వచ్చిన వారే అసెంబ్లీకి అధికారం ఇవ్వాలని వాదించడం వింతే.

ఇదీ కాంగ్రెస్ ఆదేశం…
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ బిల్లులోని ప్రధానాంశాలు ముందే పార్లమెంటు సభ్యుల ద్వారా వెల్లడి కావడంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ నేతలనుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకు అనుకూల వాదనలు చేస్తూ పోయాయి. బెంగాల్ బీహార్ కలిసిపోతామన్నాయి. ఒరిస్సాలో తీవ్ర వ్యతిరేకత పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల హెచ్చరికల దాకా వచ్చింది. బొంబాయి నగరాన్ని మహారాష్ట్రనుంచి వేరు చేయడం అంశం ఆ నగరంలో విధ్వంసానికి కాల్పుల్లో భారీ సంఖ్యలో ప్రజల మృతికి దారి తీసింది. దీనితో నెహ్రూ తదితర మంత్రి వర్గ సభ్యుల సూచన మేరకు పార్టీ బిల్లు విషయంలో ఆయా రాష్ట్రాల శాఖలకు మార్గదర్శనం చేస్తూ అధిష్టాన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలివి… బిల్లు అసెంబ్లీలకు వచ్చినపుడు కాంగ్రెస్ సభ్యులు స్వల్పమైన మార్పుల గురించి మాత్రమే సవరణలు, సూచనలు చేయవచ్చునని తెలిపింది. అయితే ఈ సవరణలు ప్రతిపాదించడానికి గానీ, ఆమోదం తెలపడానికి గానీ ముందుగా కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ నాయకుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రాల బిల్లులో ప్రధానాంశాలను సభ్యులంతా ఆమోదం తెలిపాల్సిందేనని ఆదేశంలో నిక్కచ్చిగా పేర్కొన్నారు. మార్పులేవైనా స్వల్పమైనవి మాత్రమే అయి ఉండాలని నిర్దేశించారు. ఇతరేతర అంశాలకన్నా పార్టీలోనూ, దేశంలోనూ సమైక్యత పరిరక్షణే ముఖ్యమైనదని పేర్కొంది. అందువల్ల అంతా నిగ్రహంగా హుందాగా వ్యవహరించాలని చెప్పింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.