ఆండ్రాయిడ్ ఫోన్లలో డెండ్రాయిడ్ వైరస్!

న్యూఢిల్లీ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువులను మనకు ఎంత సౌలభ్యంగా ఉంటాయో అప్పుడప్పుడు అంత్యంత ప్రమాదకారిగా మారుతుంటాయి. ఆండ్రాయిడ్ ఆధారంగా నడిచే ఫోన్లు వాడుతున్నారా అయితే జాగ్రత్త సుమా! ఎందుకుంటే ఈ మొబైళ్లపై ట్రక్కి వైరస్ డెండ్రాయిడ్ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది.

ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌ను వేరొకరు పరోక్షంగా పూర్తిగా నియంత్రించే అవకాశముందని కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ వైరస్ ఆండ్రాయిడ్‌లో యాక్టివేట్ అయితే ఇక మొబైల్ సంగతి అంతే. ఆ స్మార్ట్‌ఫోన్‌లోని కమాండ్‌ను మార్చడం, కాల్‌లాగ్స్‌ను తీసివేయడం, వెబ్‌పేజీలను తెరవడం, ఏ నంబర్‌కైనా డయల్ చేయడం, ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయడం, ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి ఆప్‌లోడ్ చేయడం, ఎస్‌ఎంఎస్‌లను వంటి అడ్డుకోవడం చేస్తుంటుంది. ఈ వైరస్‌తో దాడికి పాల్పడినవారు డెండ్రాయిడ్ టూల్‌కిట్‌తో పరోక్షంగా నియంత్రిస్తారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.