అసెంబ్లీ సమావేశాల తర్వాత హస్తినకు కేసీఆర్

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల తర్వాత టీ జేఏసీతో పాటు ఢిల్లీకి వెళ్లాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు టీ జేఏసీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లులోని లోపాలపై తాము కేసీఆర్‌తో చర్చించినట్లు టీ జేఏసీ నేతలు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యేవరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు టీ జేఏసీ వెల్లడించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.