అసెంబ్లీ ఎదుట జై తెలంగాణ

– నినదించిన టీఎస్ జేఏసీ

– 22 మంది విద్యార్థుల అరెస్ట్
– సీసీఎస్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా
తీవ్ర నిర్బంధాన్ని అధిగమించి భారీ భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గురువారం అసెంబ్లీ ఎదుట జై తెలంగాణ నినాదాలు చేసి సవాలు విసిరారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయల్దేరినా తీవ్ర నిర్బంధం ఉండటంతో 22 మంది అసెంబ్లీ వద్దకు చేరుకుని జై తెలంగాణ అంటూ నినదించారు. వేల మందిని మోహరించినా విద్యార్థులు అసెంబ్లీ ముందుకు చేరుకోవడంతో బిత్తరపోయిన పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు, తర్వాత సీసీఎస్‌కి తరలించారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆచూకీపై కొంతసేపు గందరగోళం నెలకొనడంతో తెలంగాణ ఉద్యమకారులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. చివరికి సీసీఎస్‌లో ఉన్నారని తెలియడంతో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, యెండెల లక్ష్మీనారాయణ, యెన్న శ్రీనివాసడ్డి విద్యార్థులను విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు.పోలీసులతో వాగ్వాదానికి దిగి విద్యార్థులను వెంటనే తమకు చూపించాలని డిమాండ్ చేశారు. చివరకు సీసీఎస్ డీసీపీ కార్యాలయంలో వారిని చూపించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. కాగా.. అసెంబ్లీ ఎదుట నినాదాలు చేసి అరెస్టయిన విద్యార్థులు నిరాహారదీక్ష చేశారు. తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమను అన్యాయంగా అరెస్టుచేశారంటూ సీసీఎస్‌లోనే
బైఠాయించారు.

విద్యార్థులపైన పలు కేసులు నమోదు… 
అసెంబ్లీ ఎదుట నినాదాలు చేసిన 22మంది విద్యార్థులపై సెక్షన్147, 341, 448, 188, 511, 7 క్లాస్ 1, క్రిమినల్ అమెండ్‌మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సుబ్రోత్ పటేల్‌తోపాటు, చటారి దశరత్, వెంకటాచారి, పరిగి రవి, శంకర్, రాజేష్, సంతోష్, శ్రీకాంత్, సుజిత్, మహేందర్‌డ్డి, శ్రీనివాస్‌లతోపాటు మరికొంత మంది విద్యార్థులపై కేసులు నమోదుచేశారు.

ఓయూ విద్యార్థి నాయకుడి ఇంట్లో సోదాలు
ఉస్మానియా విద్యార్థి, జాతీయ మీడియా అధికార ప్రతినిధి క్రిషాంక్ ఇంటిపై గురువారం రాత్రి సీమాంధ్ర పోలీసులు దాడిచేసి బీభత్సం సృష్టించారు. తుకారాంగేట్ ఇన్‌స్పెక్టర్ భారీగా బలగాలను వెంటబెట్టుకుని ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలోని విద్యార్ధి ఇంటికి వెళ్లి క్రిషాంక్ జాడ చెప్పమని వేధించారు. క్యాంపస్‌లో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడని చెప్పినా వినకుండా బూతుల వర్షం కురిపించారు. ‘ఇంటి నుంచే మీవోడు ఉద్యమానికి వ్యూహరచన చేస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రణాళికను నోట్‌పుస్తకాల్లో రాసి, ఇక్కడే దాచాడు’ అంటూ ఇంట్లో ఉన్న ఫైల్లు, పుస్తకాలను తీసి చిందరవందరగా పడవేశారు.నానా హంగామాతో భయవూబాంతులకు గురిచేసి వెళ్లిపోయారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.