అసెంబ్లీలో గర్జించిన తెలంగాణ బెబ్బులి

(పోరుతెలంగాణ శ్రీనివాస్): తెలంగాణ ఫైర్ బ్రాండ్ హరీష్ రావు అసెంబ్లీలో బెబ్బులై గర్జించిన్రు. మాటల తూటాలతో సీమాంధ్ర పాలకుల గుండెల్లో గుణపాలను దింపిండు. మాటమాటలో పంచ్ ఇస్తూ కిరణ్ పంచతడుపుకునేలా సవాల్ విసిరిండు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నిండు సభలో నిలదీసిండు. వలసపాలకులు చేసిన, చేస్తున్న అన్యాయాలను ఎండగట్టిండు. విద్యా, వైద్య, తాగు, సాగు నీటి రంగాలతో పాటు విద్యుత్ సరఫరాలో వివక్ష చూపుతున్న సర్కార్ పై శివాలెత్తిండు. తరతరాలుగా కాంగ్రెస్ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని సవివరంగా చెప్పిన్రు. అధికార పక్షంతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీని సభలో నిలదీసిండు. వైఎస్ తెలంగాణకు చేసిన ద్రోహంపై నిప్పులు చెరిగిండు. తెలంగాణ మంత్రుల అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. హరీష్ మాట్లాడిన మాటలు తెలంగాణ ఆవేదన, ఆకాంక్షను ప్రతిభింబించినయి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.