అసలుకంటే కొసరే ఎక్కువైంది: హరీష్‌రావు

హైదరాబాద్: విద్యుత్ కోతలపై కొత్త టారీఫ్‌లను ప్రకటిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై హరీష్‌రావు మండిపడ్డారు. నిన్న విద్యుత్ చార్జీల పెంపుపై సమీక్ష అనంతరం సీఎం కిరణ్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తగ్గించామని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కంటే కొసరు ఎక్కువైందని ఆయన దుయ్యబట్టారు. బడుగు వర్గాలపై రూ.230 కోట్లు తగ్గించామంటున్న ప్రభుత్వం కరెంట్‌పై ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వేస్తున్నారా లేదా ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.