అవ్వయ్యలను సాధకపోతే జీతం కట్

అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చదివించి పుత్రులను ప్రయోజకులను చేస్తారు..  కానీ కొడుకులు మాత్రం కనిపెంచిన తల్లిదండ్రుల మీద కర్కషత్వం చూపిస్తారు.. పెళ్లాం మాటలు విని అవ్వయ్యలను ఆగం చేస్తున్న కొడుకులకు అసోం గవర్నమెంట్ షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగి జీతంలోంచి కొంతమొత్తం కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్‌లో వేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కట్‌ చేస్తామని.. అవి వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని..  కొడుకుల ప్రభుత్వ ఉద్యోగం వల్ల పించన్‌ కోల్పోయిన తల్లిదండ్రులు కోరుతున్నారు..

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *