అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణ బిల్లును పాస్ చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ తెలిపారు.
సమావేశాలు నడుస్తున్నప్పుడే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు పాస్ చేయించాలని.. పొడగింపుల డ్రామాలకు తెరదించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నరు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పాస్ చేయిస్తమని ఊదరగొట్టిన నేతలు ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ సమావేశాలను పొడిగించి బిల్లు పాస్ చేయిస్తమని అంటున్నరని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా జనవరిలోపు తెలంగాణ ఖాయమని ప్రకటించిన విషయాన్ని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నరు.