అవకాశవాద పార్టీలతో తస్మాత్ జాగ్రత్త: నారాయణ

ప్రాంతాలవారీగా పూటకో మాట మాట్లాడుతున్న అవకాశవాద రాజకీయపార్టీలు, నాయకుల పట్ల సీమాంధ్ర ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ సూచించారు.  రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపడం సాధ్యం కాదని, ప్రస్తుతం సమస్యలపై పోరాడాలన్నారు. రాజకీయపార్టీల అవకాశవాదమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలి:
విద్యుత్ చార్జీలను రూ.9,319 కోట్లు పెంచాలన్న ప్రతిపాదలను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. పదేపదే విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రజానీకానికి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.