అలహాబాద్ రైల్వేస్టేషన్‌లోతొక్కిసలాట

rail20మంది దుర్మరణం
కుంభమేళాలో విషాదం
పోలీసుల లాఠీచార్జే కారణం?
కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి రెయిలింగ్.. 30 మందికిపైగా గాయాలు
అలహాబాద్, ఫిబ్రవరి 10:భక్త సమ్మేళనంలో అనుకోని మహా విషాదం. కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం పవివూతస్నానమాచరించిన భక్తుల్లో కొందరు రాత్రి తిరుగువూపయాణంలో అనుకోని ఘటనలో అసువులు బాశారు. అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో తెలుగువారు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికులను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేసినందునే తొక్కిసలాట జరిగిందని, ఆ తర్వాత సహాయ చర్యలు కూడా వెంటనే చేపట్టలేదనే ఆరోపణలొచ్చాయి. ఈ వార్తలను రైల్వే వర్గాలు తోసిపుచ్చాయి. రాత్రి ఏడుగంటల సమయంలో 5, 6 ప్లాట్ ఫాంలు వేల మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయినప్పుడు

తొక్కిసలాట చోటుచేసుకుంది. రైలులోకి ఎక్కేందుకు చాలామంది ఒక్కసారిగా తోసుకుపోయినప్పుడు
ఆరో నంబర్ ప్లాట్‌ఫాంకు దారితీసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి రెయిలింగ్ కూలిపోయిందని, దాంతో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అనంతరం మూడుగంటల వరకు మృతదేహాలు ప్లాట్‌ఫాంపైనే ఉన్నాయి. లాఠీచార్జి కారణంగా పరిస్థితి మరింత బీభత్సంగా మారిందని ప్రత్యక్షసాక్షులు పేర్కొనగా, ప్రయాణికులను వరుసలో నిలబడాలని కోరుతుండగా ఘటన జరిగిందని డివిజనల్ రైల్వే మేనేజర్ హరిందర్‌రావు చెప్పారు. గాయపడినవారిని వివిధ ఆస్పవూతులకు తరలించారు. ఘటనపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అవసరమైన అన్ని సహాయచర్యలు చేపట్టాలని ప్రధాని రైల్వేశాఖకు సూచించారు. ఉత్తరవూపదేశ్ ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అంతకుముందు.. సాయంత్రం కుంభమేళాలో పుణ్యస్నానాల వద్ద తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు మృతి చెందారు. వారణాసికి చెందిన భక్తురాలు, పశ్చిమబెంగాల్‌కు చెందిన భక్తుడు మరణించినట్లు అధికారులు గుర్తించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.