అరెస్టులకు నిరసనగా రేపు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన కేసీఆర్

హైదరాబాద్, మార్చి 21 : తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారమేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు  చంద్రశేఖరరావు అన్నారు. కోదండరాం, ఈటెల రాజేందర్, శ్రీనీవాస్‌గౌడ్, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌రెడ్డి తదితరుల రిమాండ్‌ను కేసీఆర్ ఖండించారు.  శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలంగాణవాదులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు తెలంగాణవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణరావు,టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురి అరెస్టులను టీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆపార్టీ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునియ్యాలనుకున్నా పదవ తరగతి పరీక్షలు ఉన్నందున, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం నిరసనలు మాత్రమే తెలపడానికి నిర్ణయించినట్లు తెలిపారు.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.