మళ్ల మాట మార్చినవా బాబు?

తెలుగు ప్రజలను సమైక్యంగా ఉంచాలట.. తెలంగాణపై సీడబ్ల్యూసీ ఏకపక్ష నిర్ణయమెట్ల తీసుకుంటదని చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిండు. ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం సీమాంధ్ర ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతకి గురిచేసిందని బాబు లేఖలో రాసిండు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బాబు తెలిపిండు. . మొన్న విభజనకు ఒప్పుకుంటమని.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు ఫలించినయని..  సీమాంధ్ర ప్రయోజనాలేంటో చెప్పాలన్న చంద్రబాబు ఇప్పుడు ఏ.. అట్లెట్ల విడదీస్తరని అంటున్నడు. అమ్మనా కొండెగ మళ్ల ఈ సమైక్య రూట్లకెళ్లి వచ్చినవా?  మొన్నోమాట ఇవ్వాళో మాట మాట్లాడుతున్నవా..? ఆంధ్రోళ్లెప్పుడూ తెలంగాణ ప్రజల క్షేమాన్ని కోరరని నిరూపించిండు. నిన్న సీఎం, ఇవాళ చంద్రబాబు చిత్తూరు బాబులే అని నిరూపించుకున్నరు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.