అమెరికాకు అనుకూలంగా ఒప్పందం!

భారత్‌లో న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ కోసం అమెరికా కంపెనీకి అనుమతులు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం వివాదాస్పదమవుతోంది.భారత్‌కు చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీ మధ్య న్యూక్లియర్ ప్లాంట్ ఒప్పందం జరగాల్సి ఉంది. న్యూక్లియర్ ప్లాంట్ నిర్వహణలో అమెరికా సంస్థ జోక్యం పట్ల విముఖత ఉన్నప్పటికీ అణు పరిహార చట్టానికి విరుద్ధంగా ఒప్పందం అమలయ్యేలా ప్రధాని కార్యాలయం ఎన్సీపీఐఎల్‌పై ఒత్తిడి తెస్తుందని సమాచారం. వచ్చే వారం అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని మన్మోహన్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నందున ఆలోపే ఒప్పందం జరిగేలా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.