అమరుల త్యాగల ఫలితమే రాష్ట్రం: టీఆర్‌ఎస్

హైదరాబాద్: అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర సమితి తెలిపింది.  సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కేబినెట్ ఆమోదం వెయించినందుకు హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పక్కకు పోకుండా చూసే బాధ్యత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు ఆనందోత్సవాలతో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.