అభయ గోల్డ్ ఆస్తులు కొనొద్దు: సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్

అభయ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులు, సిస్టర్ కంపెనీల పేరిట ఉన్న స్థిరచరాస్తులను కొనుగోలు చేయవద్దని సీఐడీ అదనపు డీజీపీ కృష్ణవూపసాద్ సూచించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను సీఐడీ సీజ్ చేసినట్టుగా చెప్పారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ 2008లో అభయ గోల్డ్ ఇన్‌వూఫాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ప్రారంచాడు. కుటుంబసభ్యులు, బంధువులనే డైరెక్టర్లుగా పెట్టుకున్న శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్తంగా 140 బ్రాంచీలను తెరిచాడు. ఆకర్షణీయమైన కమీషన్లు ఇస్తానని ఏజెంట్లను నమ్మించి డెయిలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్‌ఇయర్లీ, ఇయర్లీ డిపాజిట్ స్కీంలతో మదుపరుల నుంచి కోట్లాది రూపాయలు సేకరించాడు. అదే సమయంలో మరో పదహారు సోదర కంపెనీలను కూడా తెరిచాడు. జనం నుంచి సేకరించిన డబ్బుతో తనపేర, తన కుటుంబసభ్యుల పేర ప్లాట్లు, విలాసవంతమైన ఇళ్లు, గృహోపకరణాలు, వ్యవసాయభూములు, కార్లు కొనుగోలు చేశారు. చిట్‌ఫండ్ కంపెనీలు, ఎల్‌ఐసీలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. డిపాజిట్‌దారులకు మాత్రం చెల్లింపులు జరపలేదు. ఈ క్రమంలో అతనిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సూర్యాపేట, విజయవాడ సిటీ పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఐదు కేసుల దర్యాప్తు బాధ్యతలను సీఐడీ అదనపు ఎస్పీ రవివూపకాశ్‌కు అప్పగించారు.

విచారణలో శ్రీనివాస్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువుల పేర కృష్ణా జిల్లాలో 13.62 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 18.82 ఎకరాలు, ఒంగోలు జిల్లాలో 630.94 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 8.04 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 56.12 ఎకరాల భూములున్నట్టుగా తేలింది. కడప జిల్లాలో 13.95 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 46.80 ఎకరాలు ఉన్నట్టుగా వెల్లడైంది. ఇవి కాక.. రెండు భవనాలు, రూ. 47,66,764 నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ. 45,45,448, నాలుగు కార్లు, మూడు మోటార్‌సైకిళ్లు, 54 కంప్యూటర్లు, 28 ఎయిర్ కండీషన్లు, 12 సెల్‌ఫోన్లు, నాలుగున్నర కిలోల వెండిసామక్షిగిని సీఐడీ అదనపు ఎస్పీ రవివూపకాశ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటిని అటాచ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ కృష్ణవూపసాద్ తెలిపారు. నిందితుల్లో ఎవరైనా ఆస్తులను అమ్మకానికిపెడితే 0866-2537875, 9493896129 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.