అన్నీరెడీ చేసుకున్న ఆంధ్రులు..

-సీమాంధ్ర నాయకగణం ముందుచూపు
-53 వేల కోట్లు
-9మెగా ప్రాజెక్టులు
-విభజన అనంతరం సీమాంవూధలో
-పెట్టుబడుల విశ్వరూపానికి ప్లాన్
-లక్ష ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం
-సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి !
– పీపీపీతో బడా కంపెనీలకు అవకాశం
– సమీక్షలతో ఆమోదానికి ప్రక్రియ వేగవంతం

AP ‘శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉప్పునీరు తప్ప తాగునీరే లేదు..’ ఓ సీమాంధ్ర నాయకుడి బీద అరుపు. ‘హైదరాబాద్ పోతే ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలి?’ ఇంకో నాయకుడి దబాయింపు. ‘రాష్ట్రం విడిపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేం’ మరో ఉద్యోగసంఘం నాయకుడి దీనాలాపన. సీమాంధ్ర గల్లీనుంచి ఢిల్లీ పార్లమెంటుదాకా ఇదే నినాదం. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అనే నగరం తప్ప మిగిలిందంతా చెట్టూ పుట్టలే అయినట్టు.. కూలిన గోడల కుగ్రామాలే అయినట్టు, ఇక్కడ తప్ప మరేచోట ఉప్పుకూడా పుట్టదేమోనన్నట్టు మీడియా ప్రచారాలు. రాష్ట్ర విభజనే జరిగితే తెలంగాణ వారు హవేలీలో గానాబజానాలు చేసుకుంటుంటే సీమాంవూధులకు భిక్షాపాత్ర తప్ప మరేమీ మిగలదేమోనన్నట్టు … అందరి కళ్లకు గంతలు కట్టే వగలమారి వక్రీకరణలు.

ఇదంతా పైపై దృశ్యమే. వాస్తవమేమిటంటే విభజన ఏనాటికైనా తప్పదనే ముందు చూపుతో సీమాంధ్ర నాయకులు చాలాకాలం నుంచే జాగ్రత్త పడుతున్నారు. వారి లెక్కలు వారికి ఉన్నాయి. విభజనే జరిగితే తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే విషయంలో పక్కా లెక్కలతోనే అడుగులు వేస్తున్నారు. ఇందుకు వైఎస్ హయాంనుంచే బీజాలు పడ్డాయి. తప్పిపోయింది కానీ ఫోక్స్‌వాగన్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందులోంచి పుట్టుకు వచ్చిందే. ఆయన హయాంలోనే సమువూదతీరం మీద దృష్టి సారించి స్థానిక వ్యతిరేకతలు ఎన్ని ఎదురైనా ఓడరేవుల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. శ్రీకాకుళంనుంచి నెల్లూరు తడ దాక ఎన్నిచోట్ల వీలుంటే అన్ని చోట్ల ఓడరేవుల ప్రతిపాదనలు చేశారు. చంద్రబాబు హయాంలో అనాలోచితంగా వదిలేసిన చమురు సహజ వాయువు బావుల్లో వాటాకు పెద్ద పోరాటమే జరిగింది. సీఎంగా కిరణ్ అధికారంలోకి వచ్చాక జరిగిన పారిక్షిశామికవేత్తల సదస్సులో సీ మాంవూధకే భారీ వా టా దక్కడం కూడా యాదృచ్ఛికమేమీ కాదు.

విశాఖ పరిక్షిశమలకు భారీ పెట్టుబడుల మళ్లింపు, ఉక్కు ఫాక్ట రీ విస్తరణ, షిప్‌యార్డు ఆధునీకరణ పేరిట వందల కోట్ల ప్రతిపాదనలు అన్నీ ఈ లెక్కల్లోంచి ఊడిపడ్డవే. విశాఖను ఐటీ హబ్‌గా రూపొందించేందుకు చేయని యత్నం లేదు. కేంద్రంలోని పెద్దలను కూడా పేద అరుపులతో బోల్తా కొట్టించి లెక్కలేనన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరు సాధించారు. మానవ వనరుల శాఖలో తమకున్న పట్టుతో చదువులు పోతాయన్న సెంటిమెంటును రంగరించి ఐఐఎం వంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలను మంజూరు చేయించుకునే పనిలో సీరియస్‌గానే నిమగ్నమయ్యారు. కొత్త రాష్ట్రం వచ్చేనాటికి ఇటు ప్రాజెక్టులు, అటు విద్యాసంస్థలు, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థ, మరోవైపు కేంద్రం ప్యాకేజీ వెరసి అత్యంత సంపన్న రాష్ట్రంగా సీమాంధ్ర మారబోతున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్ర కోసం వడివడిగా చర్యలు చేపడుతున్న ప్రాజెక్టుల పెట్టుబడులు వాటి వల్ల రాబోతున్న ఉద్యోగాలు దాన్ని దృవీకరిస్తున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే విభజన అనంతరం సీమాంవూధలో పెట్టుబడులు, ఉద్యోగాల విశ్వరూపం ఆవిష్కారం కాబోతున్నది.

విభజన అనంతరం సీమాంధ్ర నష్టపోతుందన్నది ఉట్టిమాట. నిజానికి సీమాంధ్ర ప్రాంతానికి అపారమైన సహజ వనరులున్నాయి. రాయలసీమ భారీ ఖనిజాలకు గనిగా ఉంది. కోస్తా జిల్లాలకు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఎంతకూ తరగని బంగారు గని వంటిదే. చమురు, సహజ వాయువు వంటి వనరులు ఎంత సంపదనైనా పిండుకోగలిగినవే. 996 కిలోమీటర్ల సముద్ర తీరం అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార రంగాన్ని పరుగులు పెట్టించే అవకాశముంది.

అంతర్జాతీయ షిప్పింగ్, కోస్టల్ షిప్పింగ్, షిప్ మరమ్మత్తులు, ఫిషింగ్, క్యాఫ్టివ్ పోర్టులకు సంబంధించిన పరిక్షిశమలు, పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుకునేందుకు మార్గం కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే ఆంధ్ర రాష్ట్ర అవతరణ మేలు కలిగిస్తుందని, ఇంత సువిశాల తీరాన్ని పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమా అంటూ దళిత మేధావి కత్తి పద్మారావు ఎన్నోసార్లు వాదించారు. 14 ఓడరేవుల ద్వారా రూ.వేల కోట్ల ఆదాయంతోపాటు లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని లెక్కలే చెబుతున్నాయి. సీమాంధ్ర నాయకులు అమాయకులేం కాదు. మూడేళ్లుగా రాష్ట్ర విభజనను అడ్డుకుంటూనే వారి ప్రాంతాభివృద్ధికి బీజాలు వేసుకుంటున్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.53 వేల కోట్ల పెట్టుబడులతో 9 అత్యంత కీలకమైన ప్రాజెక్టులను ఇప్పటికే సాధించారు. వాటిని పట్టాలకెక్కించే పనులు ఇపుడు సచివాలయంలో జోరుగా సాగుతున్నది.

వాటి ద్వారా లక్ష దాకా ఉద్యోగాలు రానున్నట్లు సమాచారం. ఇక్కడ క్లియన్సు వచ్చిన మరుక్షణమే ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటికి మూడేళ్ల క్రితమే అంకురార్పణ చేసుకున్నారన్న అధికారిక సమాచారం సీమాంధ్ర నాయకుల లెక్కల వాడిని తెలుపుతోంది. గడిచిన మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మెహంతి నేతృత్వంలో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారులు ఇందుకోసం కసరత్తును తీవ్రతరం చేస్తున్నారు. దఫదఫాలుగా శాఖలతో సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర పాలనావ్యవహారాల్లో మంత్రులతో పాటు ఐఏఎస్‌లు, ఇతర అధికారులంతా సీమాంవూధకు చెందిన వారే కావడం వల్ల వారి దృష్టి మొత్తం ఈ ప్రాజెక్టుల మీదే ఉంది. ఈ ప్రాజెక్టుల ప్రతిపాదన తెచ్చింది రేపు నిర్మాణమైతే వెనక ఉండి నడిపించేది సమైక్యాంధ్ర రాష్ట్రం కావాలంటూ ఉద్యమానికి నాయకత్వం వహించే నాయకులే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమన్న ముందుచూపుతో వారి ప్రాంత అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునే దిశగానే ప్రాజెక్టులకు వ్యూహరచన చేశారని ప్రతిపాదనలే స్పష్టం చేస్తున్నాయి. సీమాంధ్ర నాయకులు ఏది చేసినా వారికో లెక్క ఉంటుంది. ఒంగోలు రాజధాని అనగానే సమైక్యాంధ్ర ముఖ్యనేతలే అక్కడ అంగుళం మిగలకుండా కొనేయడం మనకు తెలుసు. కొత్త రాజధాని నిర్మాణం కూడా వారికి కనకవర్షం కురిపించబోతున్నది. సచివాలయం మొదలు సులభ్ కాంప్లెక్స్ వరకు అన్ని కాంట్రాక్టులు సదరు నాయకులకే దక్కుతాయి. అందువల్లనే సోనియాగాంధీ చెప్పింది విని కాంట్రాక్టులు దక్కించుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు.

ఓడరేవుల అభివృద్ధితో రూ.వేల కోట్ల ఆదాయం
కోస్తాలో ఇప్పటికే ఉన్న విశాఖపట్నం, కళింగపట్నం, భీముడిపట్నం, గంగవరం, నక్కలపల్లి, కాకినాడ సెజ్, కాకినాడ, ఎస్.యానాం, నర్సాపూర్, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం, మేఘవరం, భావనపాడు వంటి పోర్టల్స్‌ను మరింతగా అభివృద్ధి చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. వాటి స్థాయిని రెట్టింపు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పెట్రో, గ్యాస్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. గల్ఫ్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి లిక్విడ్ గ్యాస్‌ను దిగుమతి చేసుకొని నేచరల్ గ్యాస్‌గా మార్చి పంపిణీ చేసేందుకు ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఇవి ఇప్పుడున్న 5 ఎంటీపీఏ నుంచి 10ఎంటీపీఏ స్థాయికి చేరొచ్చునని ఓ ఉన్నతాధికారి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.

భావనపాడు, దుగ్గరాజుపట్నంల్లోనూ ఓడరేవులు
కేంద్ర ప్రభుత్వం శ్రీకాకుళం, భావనపాడు, దుగ్గరాజుపట్నంల్లో ఓడరేవులను ఏర్పాటు చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భావనపాడు, దుగ్గరాజుపట్నంల్లో రూ.4 వేల కోట్ల వంతున పెట్టుబడితో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. భావనపాడులో 5300 ఎకరాలు, దుగ్గరాజుపట్నంలో 2800 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ రెండింటిపైనా ఈ నెల 27వ తేదీన కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మెహంతి సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో బెర్త్‌ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం.

-సీమాంవూధలో ఏర్పాటు చేయనున్న 9 ప్రాజెక్టుల విలువ రూ.53,745 కోట్లు. తెలంగాణలో అంటే సంగాడ్డి- జహీరాబాద్ రహదారి విస్తరణ ప్రతిపాదన, ఖమ్మం సరపాకలో ఏర్పాటు చేసే కాగితపు పరిక్షిశమల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ కేవలం రూ.4,772 కోట్లు.
తీరం వారికో వరం
-ఆంధ్రవూపదేశ్‌లో రీగ్యాసిఫైడ్ ఎల్‌ఎన్‌జీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్దేశించి కాకినాడ రీగ్యాస్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టునే ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్‌గా పిలుస్తారు. లిక్విడ్ గ్యాస్ దిగుమతి చేసుకొని దాన్ని గ్యాస్‌గా మార్చి సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టును చేప షెల్, గెయిల్ గ్యాస్ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పోటీ పడుతున్నాయి. గెయిల్ గ్యాస్ కంపెనీ 50 శాతం, ఏపీజీఐడీ, ఏపీసీడీసీలు 50 శాతం వాటాలుగా చేపడుతాయి. ప్రభుత్వ రంగ సంస్థల ఈక్విటీ 26 శాతం, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌ల ఈక్విటీ 24 శాతంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి బిడ్డింగ్ ద్వారా ఎంపిక ప్రక్రియనే చేపడుతున్నారు. ఫ్లోటింగ్ రీ గ్యాసిఫికేషన్ స్టోరేజీ యూనిట్ ద్వారా 5 ఎంటీపీఏ లిక్విడ్ గ్యాస్‌ను నేచురల్ గ్యాస్‌గా మారుస్తారు. ఇప్పటికే ఇంజినీరింగ్, డిజైన్ పనులన్నీ పూర్తయ్యాయి. ఎఫ్‌ఎస్‌ఆర్‌యు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్(ఈఐఏ) నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఆంధ్రవూపదేశ్ కాలుష్య నియంవూతణ మండలికి ఈ మేరకు నివేదికను సమర్పించారు. దానికి అనుగుణంగానే ప్రాజెక్టును చేపడుతామని పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ రెండు కంపెనీల్లో దేనికి అప్పగించాలన్న అంశంపై హై లెవెల్ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభివూపాయాన్ని కూడా తీసుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
-వైజాగ్‌లో 8 మిలియన్ టన్నులు/సంవత్సరం స్థాయి కలిగిన పెల్లెట్ ప్లాంటును ఎస్సాఆర్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రాజెక్టును చేపట్టింది. కిరండల్ నుంచి చత్తీస్‌గఢ్‌కు 267 కి.మీ. పైపులైన్‌ను కనెక్ట్ చేశారు. దీని కోసం రూ.3600 కోట్లు ఖర్చు చేశారు. అలాగే బెనిఫికేషన్ ప్లాంట్ నుంచి పెల్లెట్ ప్లాంట్ వరకు 463 కి.మీ వరకు రెండో పైపులైన్‌ను వేస్తారు. ఆంధ్రా, ఒడిషా, చత్తిస్‌గఢ్ రాష్ట్రాల కారిడార్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు లభించాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పెండింగ్ ఉంది.

అన్నీ ఉన్నా.. అనుమతికి నో
ఇక తెలంగాణలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా సారపాకలో పల్ప్ అండ్ పేపర్ మెగా ప్రాజెక్టు ఏర్పాటుకు అన్నీ ఉన్నా అనుమతి లేదు. ఫారెస్ట్‌కు చెందిన 445 హెక్టార్లను డీగ్రేడ్ చేశారు. ఏపీఐఐసీ ద్వారా కంపెనీకి కేటాయించవల్సి ఉంది. అనుమతులు మంజూరు చేయాలని సెప్టెంబరు 17న జరిగిన సమావేశంలో స్టేట్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌లో ఏకక్షిగీవంగా తీర్మానించారు. దాన్ని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌కు పంపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం అంగడి రాయిచూర్, ఇందనూర్‌లో మెగా సిమెంట్ ప్లాంట్(5 ఎంటీపీఏ)ను రూ.2000 కోట్లతో ఏర్పాటు చేసేందుకు సీతారాం సిమెంట్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు కూడా ఆమోదించింది. దీనికి 324.38 ఎకరాల స్థలం అవసరం. కానీ ఇంకా గనులు, భూగర్భ జల వనరుల శాఖ నుంచి అనుమతులు లభించలేదు. సంగాడ్డి నుంచి మహారాష్ట్ర/కర్నాటక రాష్ట్రాల సరిహద్దు వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు భూ సేకరణ దగ్గరే నిలిచిపోయాయి. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రూ.47 కోట్లకు గాను రూ.11.35 కోట్లు మాత్రమే చెల్లించారు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం 93.46 కోట్లకు గాను రూ.26.05 కోట్లు పంపిణీ చేశారు. 30 గ్రామాల్లో 24,57,538 చ.మీ. భూమిని సేకరించారు. దీంట్లో 18,42,534 చ,మీలకు గాను రూ.93.46 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలని నిర్ధారించారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.