అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయే !!

అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు ఎగ్జామ్‌ రాసిన స్టూడెంట్స్‌ లా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యే ఎదురుపడగానే అన్నా నీకెన్ని మార్కులు వచ్చినయి. సర్వేలో నీకెంత శాతం వచ్చిందని ఎంగ్జాయిటీతో అడిగి తెలుసుకున్నారు. ఇంటర్‌ రిజల్ట్ వచ్చిన కాలేజీ ప్రాంగణంలాగా  అసెంబ్లీ ప్రాంగణం మారిపోయింది.

అసెంబ్లీలోనే కాదు..  రాష్ట్రమంతా కేసీఆర్ చేయించిన సర్వే మీదే చర్చ నడుస్తుంది.  మా ఎమ్మెల్యే ఇంతవరకు ఏం చేసిండా అని ప్రజలంతా లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *