అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రేణుక: ఎంపీ పొన్నం

తెలంగాణ అంశంలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని రేణుకా చౌదరి తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ అంశంపై రేణుక మాట్లాడకుండా పెద్దలు కట్టడి చేయాలని కోరారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసేదీ లేదని, అందువల్లే ఆమె తెలంగాణ సెంటిమెంట్‌ను కించపరుస్తున్నారని ఆరోపించారు. ఆమె ప్రకటనల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరుగుతున్నదని, తనదీ తెలంగాణే అని చెప్పుకుంటున్న రేణుక సీమాంధ్ర నేతల వాదనను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.