అధికారపక్షం కొమ్ముకాస్తున్న్ ప్రతిపక్షం…చరిత్రకెక్కిన చంద్ర బాబు

 

babuu
తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు
మాత్రమే విప్ జారీ
జంప్ జిలానీలపైనే నజర్
ఇది నిజంగా చంద్రబాబు రికార్డే
అవిశ్వాసంలో అధికారపక్షానికి మద్దతు
ఎన్నడూ లేదంటున్న పరిశీలకులు
రికార్డుల చంద్రబాబు.. మరో రికార్డు సృష్టించారా? రికార్డు పేరుతో ఓ దుస్సంవూపదాయానికి తెరతీశారా! అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే.. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ.. నిలబె పూనుకోవడం ద్వారా కొత్త చరివూతను లిఖిస్తోందా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు! సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిన సందర్భంలో దానికి దూరంగా నిలిచిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ దేశంలోనే ఎక్కడా లేదని పలువురు అంటున్నారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ తదితర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థ వైఖరి పాటించాలన్న నిర్ణయంతో రికార్డు సృష్టించిన తెలుగుదేశం పార్టీ.. ప్రత్యేకించి తన పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం ద్వారా మరో రికార్డునూ సొంతం చేసుకుందని అంటున్నారు. సస్పెండైన ఎమ్మెల్యేలు కొప్పుల హరీశ్వర్‌డ్డి (పరిగి), వేణుగోపాలాచారి (ముథోల్), బాలనాగిడ్డి (మంవూతాలయం), అమరనాథ్‌డ్డి (పలమనేరు), ప్రవీణ్‌కుమార్‌డ్డి (కంబాలపల్లి), సాయిరాజ్ (ఇచ్ఛాపురం), టీ వనిత (గోపాలపురం), చిన్నం రామకోటయ్య (నూజివీడు), కొడాలి నాని (గుడివాడ)లకు టీడీపీ విప్ దూళిపాళ నరేంద్ర గురువారం నోటీస్‌లు జారీ చేశారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతుగాకానీ, వ్యతిరేకంగా కానీ ఓటు వేయకుడదని పేర్కొన్నారు. అయితే.. ప్రజాస్వామ్య సంప్రదాయాలు పాటించాల్సిన రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం.. తమకు ఇబ్బంది కలుగుతుందన్న భావనతో వాటికి విరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ప్రతిపక్ష పాత్రకు అన్యాయం చేయడమే అవుతుందని చెబుతున్నారు.

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను కూడా నిలుపుకోలేని వాళ్లు రాజకీయాల్లో ఉండడం తగదని తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. వాటికి టీడీపీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేకపోవడం.. ఇప్పుడు వేరే పార్టీలు పెట్టే అవిశ్వాసానికి మద్దతు పలకడం ద్వారా తన ప్రాబల్యం తగ్గిపోతుందని భావించడమే టీడీపీ వెనుకంజకు కారణమన్న వాదన వినిపిస్తున్నది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న పాలకవర్గాన్ని కూల్చివేసేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా తన ఎమ్మెల్యేలకు తటస్థంగా ఉండాలని విప్ జారీ చేయడం రాష్ట్ర రాజకీయ చరివూతలో ఎన్నడూ లేనిదని రాష్ట్ర రాజకీయాలను ఐదు దశాబ్దాలపాటు కాచివడపోసిన ఓ సీనియర్ నేత చెప్పారు. అధికార పక్షాన్ని కాపాడేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నించడం కూడా ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కమ్యూనిస్టులు, సోషలిస్టు పార్టీ వ్యతిరేకించడంతో పడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీ, ఏ నినాదంకోసం అవిశ్వాస తీర్మానం ఇచ్చిందనేది ముఖ్యం కాదని, పరిపాలించే అర్హతలేని సర్కారుపై ఎవ్వరు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చినా అండగా నిలి చి ప్రభుత్వాన్ని కూల్చడమనేది ప్రతిపక్షం పని అని అన్నారు. సభలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎన్ని వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని టీడీపీకి చెందిన ఒక నేత పేర్కొనడం విశేషం.

టీడీపీ మద్దతిస్తే సర్కారు కూలడం ఖాయం
అవిశ్వాసానికి టీడీపీ మద్దతుగా ఉంటే సర్కారు కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని అంటున్నారు. టెక్నికల్‌గా శాసనసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 155 మంది సభ్యుల సొంత బలం, అనుబంధంగా ఉన్న మరో స్వతంత్ర అభ్యర్థి (కూన శ్రీశైలంగౌడ్) మద్దతు కలుపుకుంటే 156 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వీరు సభలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వాస్తవ బలం 147 మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్‌కంటే ఒక్క సభ్యుడు తక్కువే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సభ్యు లు ఎక్కువ మంది ఉన్నారు. ఓటింగ్ సమయంలో ప్రభుత్వం కూలిపోతుందని అర్థమైతే.. మరో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కూలిపోతే మా పరిస్థితేంటి?
టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తే ఈ సర్కారు కూలిపోవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత ఒకరు అన్నారు. ‘చెప్పుకోవడానికి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తరువాత మా పరిస్థితి ఏమిటన్నదే మమ్మల్ని వేధిస్తున్న చిక్కు ప్రశ్న’ అని వాపోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గి.. ప్రభుత్వం కూలిపోతే ప్రభుత్వ ఏర్పాటుకు తమనే పిలుస్తారని, కానీ.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పార్టీ ఒక్కటి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రపతి పాలన వస్తుందని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లినా.. ఇప్పుడున్న స్థానాలు కూడా దక్కే స్థితి లేదని మరో నేత చెప్పారు. అందుకే ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.