అదో వి చిత్ర పురి !

 

reel10– పేద సినీ కార్మికుల కోసం ఏర్పాటు
– పేదలకు జాగా అందని పండే
– నిష్ఫలమవుతున్న ప్రభాకర్ రెడ్డి తపన
– రాయితీలతో పొందిన సర్కారీ స్థలం
– నామమావూతపు ధరలకే ఇవ్వాలి
– కానీ.. రేటు పెడితేనే స్థలం దక్కేది!
– భారీ ఎత్తున చేతులు మారిన సొమ్ము?
– అబ్బే.. అలాంటిదేమీ లేదన్న నిర్వాహకులు

సినిమా సక్సెస్ వెనుక హీరో హీరోయిన్‌లు.. దర్శక నిర్మాతలు.. ఇతరత్రా సాంకేతిక సిబ్బంది మాత్రమే కాదు.. వందల మంది సినీ కార్మికుల చేయూత కూడా ఉంటుంది! లైట్‌బాయ్ మొదలు.. మేకప్‌మ్యాన్‌ల వరకూ.. క్రేన్ ఆపరేట్లు మొదలు.. ఎలక్ట్రీషియన్లదాకా.. సెట్‌లు వేసే కళాకారులు మొదలు.. కాస్ట్యూమ్స్ తయారు చేసేవారిదాకా! ఎందందరి చేతులో కలిస్తేనే పదహారు రీళ్ల సినిమా! కానీ.. సినిమా విజయంలో.. సినీ రంగ అభివృద్ధిలో ఈ పేద కళాకారులు, సాంకేతిక కార్మికులు మాత్రం దగాపడుతూనే ఉన్నారు! ఇలాంటివారికి సొంత ఇల్లు అంటే.. ఊహించడానికే సాధ్యం కానిది! అందులోనూ దశాబ్దకాలంగా నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్న తీరు నేపథ్యంలో ఏ సినీ కార్మికుడూ కనీసం ఆ ఆలోచన కూడా చేయడానికి సాహసించని పరిస్థితి! కానీ.. ఒక్కరు మాత్రం ఆలోచించారు! పేద సినీ కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరేందుకు తపన పడ్డారు! ఆయనే ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ సినీ కళామతల్లి ముద్దుబిడ్డ! కానీ.. ఆయన తపన నిష్ఫలమవుతున్నది.

పేద కార్మికులకు నామమావూతపు ధరకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆయన చొరవతో ఏర్పడిన చిత్రపురి కాలనీ.. లక్ష్యానికి దూరం జరుగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులోనూ సీమాంధ్ర దందాయే కొనసాగుతుండటం ఆశ్చర్యం కల్గించే అంశం ఏమీకాదు!

సీమాంవూధకు చెందిన కొందరు సొసైటీ పెద్దలుగా చలామణి అవుతూ ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లు నామమావూతపు ధరకు కాలనీలో స్థలాలు కేటాయించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని సొసైటీ సభ్యులు విమర్శిస్తున్నారు. ఈ భూమిని అభివృద్ధి చేయడానికి డెవలప్‌మెంట్ చార్జీల కింద రూ.24 కోట్లు అవుతున్నాయి. దీంతో అందులో కొంత భారం తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలను మినహాయించింది. మొత్తంగా 20 కోట్లకు ఈ భూమిని ఇచ్చింది. అన్ని రకాల అనుమతులూ దక్కాయి. ఈ భూమిలో 4213 మంది కార్మికులకు సొంత ఇంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

ఇక్కడే తిరకాసు మొదలైంది. సర్కారు నుంచి అనేక రాయితీలు పొందిన సొసైటీ పెద్దలు.. రియల్ మార్కెట్‌ను తలదన్నేరీతిలో వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం చేపట్టిన సంస్థతో కుమ్మక్కయిన పెద్దలు.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన సినీ కార్మికులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లు
సభ్యత్వం ఇచ్చిన తీరు అంతా అనుమానమే.

ఆంధ్రవూపదేశ్ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా రిజిస్టరైన చిత్రపురి కాలనీలో ఆర్టిస్టులు, సినీ పరిక్షిశమకు చెందిన వారికే సభ్యత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఈ నిబంధనను సొసైటీ పెద్దలు ఉల్లంఘించారని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏ ఇద్దరు సినీ కార్మికులను కదిపినా.. సొసైటీ సభ్యత్వం తీరుతెన్నులపై కథలు కథలుగా వర్ణిస్తున్నారు. నిజానికి సొసైటీ ఏర్పడిన తర్వాత సభ్యత్వం స్వీకరిస్తారు. సభ్యత్వం ఫైనల్ అయిన తరువాత రిజివూస్టార్ ఆఫ్ కో ఆపరేటీవ్ సొసైటీస్‌కు సభ్యత్వ రికార్డులను సమర్పిస్తారు. ఆ తరువాత తమ సొసైటీలో ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలియజేస్తూ ఇళ్ల స్థలాల కోసం ఎంత భూమి అవసరమవుతుందో ఆ మేరకు సొసైటీకి కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. సొసైటీ విజ్ఞప్తిని పరిశీలించి, వాస్తవాలేనని నిర్థారణ చేసుకొని ఆ మేరకు భూమిని సొసైటీకి కేటాయిస్తారు.

దివంగత సినీనటుడు డాక్టర్ ప్రభాకర్‌డ్డి ఉన్నంత వరకు ఈ పద్ధతిలోనే కార్యక్షికమాలు జరిగాయి. ఆయన కృషితో ప్రభుత్వం 1993లోనే 67 ఎకరాల భూమిని మణికొండలో కేటాయించింది. 2000 నాటికి సర్కారు కేటాయించిన భూమికి పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించి, భూమిని సొసైటీ సొంతం చేసుకుంది. అయినా వివిధ కారణాల వల్ల ఇక్కడ నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయి. నాలుగేళ్లలో సీన్ మారిపోయింది. 2004 తరువాత రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. 2007 నాటికి తార స్థాయికి చేరుకుంది. ఎకరం భూమి విలువ కోట్లకు చేరుకుంది. ఇక్కడి నుంచే సొసైటీ పెద్దలకు వక్రబుద్ధి కలిగిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సొసైటీ పునాదులపైనే పనిలోపనిగా తమ ఆర్థిక పునాదులూ వేసుకోవాలని భావించిన సొసైటీ పెద్దలు సభ్యత్వం విషయంలో ఆటలాడుకున్నారని విమర్శలున్నాయి. నచ్చినవారికి సభ్యత్వం ఇవ్వడం.. నచ్చనివారిని తొలగించడం అనే ప్రక్రియ యథేచ్ఛగా సాగిపోయిందని అంటారు.

మొదట సభ్యత్వం తీసుకోవడానికి రుసుం రూ.510లుగా నిర్ణయించారు. ఇందులో పది రూపాయలు సభ్యత్వం కాగా, మిగిలినది వాటా ధనంగా నిర్ణయించారు. ఆ తరువాత బ్యాంకు నుంచి రుణం పొందడం కోసం సభ్యుడి వాటా ధనాన్ని రూ.2500గా నిర్ణయించారు. పాత సభ్యులు రెండు వేలు చెల్లించాలని, కొత్త సభ్యులు రూ.2500 చెల్లించాలని నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నది. కానీ, సొసైటీలో సభ్యులు కొంత మంది బకాయిలు పూర్తిగా చెల్లించలేదన్న నెపంతో ఏకంగా 1700 మంది సభ్యత్వాన్ని అడ్డగోలుగా తొలగించారు. నిజానికి హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వం తీసుకున్న తరువాత, సభ్యత్వం నుంచి తీసి వేయరు. సభ్యుడు తనకు తానుగా వైదొలగాలనుకుంటే తప్ప.. ఇతరత్రా అవకాశం ఉండదు. సొసైటీ సభ్యులు ముందుగా సభ్యత్వ రుసుం, వాటాధనం చెల్లించిన తరువాతనే సభ్యుడవుతాడని, అలాంటప్పుడు అతడిని ఎలా తొలగిస్తారని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న వాదనలు ఉన్నాయి. తొలగించిన సభ్యత్వాల స్థానంలో సినీ పరిక్షిశమకు సంబంధం లేని వారిని, తమకు అనుకూలంగా ఉండే వారిని నింపుకొంటున్నారని సినీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒక్క సభ్యత్వానికి, సదరు సభ్యుడు తీసుకునే ఫ్లాటునుబట్టి రెండు నుంచి మూడు లక్షల వరకు ముడుపులు తీసుకొని సభ్యత్వం ఇస్తున్నారని వినికిడి. అనర్హులకు ఇచ్చారన్న విమర్శలు రాకుండా కూడా వీరే చూసుకుంటారు. కొత్తగా వస్తున్న సభ్యుడు సినీ పరిక్షిశమలోనే ఉన్నట్లు రికార్డులు పుట్టుకొస్తాయి. అందుకు పాతికవేలో.. ముప్పైవేలో ఖర్చు పెడితే చాలన్న విమర్శలు ఉన్నాయి.

తెలంగాణ గడ్డపై కొనసాగుతున్న సీమాంధ్ర సినీ పరిక్షిశమలో కింది స్థాయిలో అనేక మంది కార్మికులు పని చేస్తున్నారు. కానీ.. చిత్రపురి కాలనీలో సభ్యత్వం పొందగలిగినవారిలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కనీసం పది శాతం కూడా లేరని లెక్కలు చెబుతున్నాయి. ఈ గడ్డపై పుట్టి..ఇక్కడి సినీ పరిక్షిశమలో పని చేస్తున్నా.. తమకు ఇక్కడ ఇల్లు దక్కే పరిస్థితి లేదని పలువురు కార్మికులు వాపోతున్నారు.

ఫ్లాట్ల నిర్మాణంలోనూ అదేతీరు
సొసైటీలో సభ్యత్వంలో గోల్‌మాల్ చేసిన పెద్దలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణ వ్యవహారంలోనూ అదే చేతివాటాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లను నిర్మించడానికి ముందుగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దీనికి ముందుగానే పలు రూపాల్లో ఐవీఆర్‌సీఎల్ సంస్థతో లావాదేవీలు నిర్వహించిన ఈ సొసైటీ పెద్దలు.. టెండర్లలో పాల్గొన్న సంస్థలను కాదని, ఐవీఆర్‌సీఎల్‌కే భవన నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో.. కామన్‌డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో నిర్మాణ ఖర్చులతోనే సభ్యులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వవచ్చు. కానీ దీనికి విరుద్ధంగా సొసైటీ వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

దాదాపుగా మణికొండ ప్రాంతంలో సాధారణ రియల్ ఎస్టేట్ వెంచర్లు వసూలు చేస్తున్న ధరలను ఇక్కడ కూడా వసూలు చేస్తుండటంతో సభ్యులు విస్తుపోతున్నారు. 2010లో జరిగిన సొసైటీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పాలకమండలి సభ్యులు కొంత మంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. 1993లో పొందిన భూమికి ప్రభాకర్‌డ్డి బాధ్యతల్లో ఉన్న కాలంలో 20 ఎకరాల భూమికి రూ.40 లక్షలు చెల్లించారు. 2000 సంవత్సరంలో రూ.97 లక్షలను చెల్లించారు. ఈ సమయంలో ఐసీఆర్‌ఎల్ సంస్థనే తాను నిర్మాణం చేస్తానని చెప్పి ముందుగా ఈ డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఏదిఏమైనా ఈ భూమికి చెల్లించిన సొమ్మును 4213 మందికి సమానంగా విభజిస్తే.. ఒక్కో సభ్యుడికి రూ.3251 మాత్రమే అవుతుంది.

దీనితో పాటు డెవలప్‌మెంట్ చార్జీల్లో ఆరు కోట్ల రూపాయల రాయితీ లభించింది. ఎల్‌ఐజీ(లో ఇన్‌కమ్ గ్రూప్), ఈడబ్ల్యూఎస్‌కు భారం పడకుండా ప్రభుత్వం ఈ రాయితీ కల్పించింది. దీంతో ఎల్‌ఐజీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఎలాంటి అభివృద్ధి చార్జీల భారం వేయకుండా కేవలం నిర్మాణ వ్యయంతోనే ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఆయా ఫ్లాట్లను సినిమా పరిక్షిశమలోని అట్టడుగు కార్మిలకు తక్కువ ధరకే కేటాయించాలి. కానీ ఈ క్వార్టర్స్‌ను కూడా చదరపు అడుగును (ఎస్‌ఎఫ్‌టీ) రూ.1000 చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీంతో రోజు కూలి కింద నెలకు సగం రోజులు మాత్రమే పనిదొరికే జూనియర్ ఆర్టిస్టులు , ఇతర కార్మికులు బ్యాంకు రుణాలు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఫ్లాటు ఆలోచన చేయాలం భయమేస్తున్నదని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వీరికి నిర్మాణపు ధర ఎస్‌ఎఫ్‌టీకి రూ.700 కంటే ఎక్కువ కాదని సివిల్ ఇంజినీర్ ఒకరు అన్నారు. ఇది కాకుండా ఎంఐజీ, హెచ్‌ఐజీ,‘ రో’ హౌజెస్‌కు కూడా నిర్మాణ ఖర్చు ఎస్‌ఎఫ్‌టీకి రూ.800 కంటే ఎక్కువ కాదని ఈ రంగ నిపుణుడొకరు అన్నారు. ఆ ప్రకారంగా చూస్తే 1000 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాటుకు రూ.8లక్షలు అవుతుంది. కానీ రూ.16 లక్షలు వసూలు చేస్తున్నారు. 1670 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాటుకు రూ.13.36 లక్షలు అవుతుంటే.. రూ.27 లక్షలు వసూలు చేస్తున్నారు. 1500 ఎస్‌ఎఫ్‌టీ ‘రో’ హౌజెస్‌కు చదరపు అడుగుకు వేయి చొప్పున రూ.15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ రూ.34 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఫ్లాట్లు నిర్మించి ఇస్తే నిర్మాణ ఖర్చులకు అదనంగా డెవలప్‌మెంట్ చార్జీలు, భూమి విలువను కలిపితే ఒక్కో సభ్యుడు రూ.90 వేలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ సొసైటీ పెద్దలు సభ్యుల వద్ద అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతా క్విడ్ ప్రోకో
అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సొసైటీ.. బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలను పరిశీలించకుండానే ఏకపక్షంగా ఐవీఆర్‌సీఎల్‌కు పనులను అప్పగిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి భారీ ఎత్తున ఫ్రతిఫలం ముట్టిందని అంటున్నారు. సొసైటీలోని కీలక వ్యక్తులకు నిర్ణయించిన ధరలో దాదాపు 10శాతం సొమ్మును క్విడ్ ప్రోకో కింద ముట్టిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం మణికొండ ఓపెన్ మార్కెట్‌లో భూమినికొని అపార్ట్‌మెంట్లు నిర్మించి ఫ్లాట్లు విక్రయించే సంస్థలు ఎస్‌ఎఫ్‌టీ రూ.2000 వేలు చెప్పి, రూ.1700కు, చివరికి రూ.1600కు సైతం అమ్ముతున్న పరిస్థితి ఉందని సమాచారం. మరి చిత్రపురి కాలనీలో ఇన్ని రాయితీలు పొందిన తర్వాత కూడా తమకు మార్కెట్ ధరకే ఇవ్వటం ఎంత వరకూ సమంజసమని సభ్యులు నిలదీస్తున్నారు.

ఈ అవినీతి బాగోతాలు బయటపడాలంటే సొసైటీ పెద్దల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న వెంక హైటెక్స్ దగ్గరలోని జయభేరీ వద్ద ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు, షావొపూట్ కారుతో పాటు.. నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. వీటన్నింటికీ ఫ్యాన్సీ నంబర్ అయిన 2222 ఉంటుందని చెబుతున్నారు. సినీ రంగంలోకి వచ్చేటప్పటికే ఈయన ఆస్తిపరుడా అంటే అదేమీకాదని అంటున్నారు. ఒకనాడు సినిమా రంగంలో ఉపాధిని వెతుక్కుంటూ మాచర్ల నుంచి వచ్చి, 2010 వరకూ జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసే ఏజెంటుగా పని చేసిన వెంక అకస్మాత్తుగా ఇంత ఆస్తి ఎక్కడి నుంచివచ్చిందన్న అనుమానాలు ఉన్నాయి. ఇతని ఆస్తులపై విచారణ జరిగితే చాలా బాగోతాలు బయటికి వస్తాయని సభ్యులు చెబుతున్నారు. ఇకనైనా ఈ సొసైటీలో అక్రమాలకు తెర దించి.. ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలను ఉపయోగించాలని, సామాన్య సినీ కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.