లోక్‌సభలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని, హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సభలో వ్యవహరించిన రౌడీ ఎంపీలను భగత్‌సింగ్‌తో పోల్చడమా? అని వారు నిప్పులు చెరిగారు. వారు ఎంపీలు కాదు టెర్రరిస్టులు అని, వారిపై హత్యానేరంతోపాటు ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధిస్తూ లోక్‌సభలో తీర్మానం చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఏఐసీసీ సభ్యుడు గూడురు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా లగడపాటి పెప్పర్ స్ప్రే ప్రయోగించారని విమర్శించారు. సభ్యులను హత్య చేయాలనే వ్యూహంతోనే లగడపాటి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. లగడపాటిపై 307 సెక్షన్ ప్రకారం హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లగడపాటి, మోదుగుల చర్యలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమర్థించడాన్ని గుత్తా తీవ్రంగా ఖండించారు. వేటకొడవళ్లు, బాంబుల సంస్కృతిని కలిగి ఉన్న మీకు పెప్పర్ స్ప్రే ఘటన చిన్నదిగా కనిపించిందా? అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. ఇంతపెద్ద దారుణానికి ఒడిగట్టిన మోదుగుల విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. లోక్‌సభలో నిన్న చేసిన ఘటనకు ఆంధ్రా భగత్‌సింగ్ అంటూ టీవీల్లో లగడపాటి, మోదుగుల ప్రకటనలు వేయించుకుంటున్నారని, దీనిని చూసి ఏడ్వాలో, నవ్వాలో అర్థం కావడం లేదన్నారు. టీడీపీతో జతకలిపి తెలంగాణ విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
దేశం ఖండిస్తున్నా.. మాట్లాడరేం..?: పొన్నం
మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయినప్పుడు రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆంధ్రవాళ్లను రాజాజీ ఆదేశించి మంచిపని చేశారనేది ఇప్పుడు వారిచర్యలను చూస్తుంటే అర్థమవుతున్నదని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. నాడు పార్లమెంట్‌పై అఫ్జల్‌గురు చేసిన దాడికి, నేడు సీమాంధ్ర ఎంపీలు జరిపిన దాడికి ఎలాంటి తేడా లేదన్నారు. ఒక రౌడీ ఎంపీని భగత్‌సింగ్‌తో పోల్చుతారా? అని ప్రశ్నించారు. ‘ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడినట్లు లగడపాటి చెబుతున్నారు. రేపు పార్లమెంట్లో ఇంకెవరైనా స్టెన్‌గన్‌తో ప్రవేశించి నలుగురిని కాల్చి ఆత్మరక్షణ కోసం చేశానంటే ఎలా?’ అని ప్రశ్నించారు.
గాడ్సే ప్రతినిధులు..: మధుయాష్కీ
లోక్‌సభలో గురువారం ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్పడిన ఘటనలను పార్లమెంట్‌పై జరిగిన దాడిగా లోక్‌సభలో ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ మధుయాష్కీ అభివర్ణించారు. ఈ ఘటనలకు పాల్పడిన ఆ ఇద్దరు ఎంపీలపై హత్యానేరం, ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. వారు ఎంపీలు కాదు ఉగ్రవాదులు అని ఆయన ఆరోపించారు. సోమ, మంగళవారాల్లో బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది తీరుతుందన్నారు.
లగడపాటి అభినవ గూండా: అంజన్‌కుమార్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ సభలో తమపై దాడులు చేయించిందని లగడపాటి చేసిన ఆరోపణలను అంజన్‌కుమార్ యాదవ్ ఖండించారు. కొట్టాలనుకుంటే ఇతర రాష్ట్రాల ఎంపీలు ఎందుకు? మేమేమైనా తక్కువా..? అని లగడపాటి తీరుపై ధ్వజమెత్తారు. ‘ఏదో గొప్ప చేసినట్లు.. భగత్‌సింగ్ అంటూ ప్రకటనలు ఇప్పించుకుంటున్నారు. అసలు వాళ్లు బట్టేబాజ్లు, అభినవ గుండా’లు అని కితాబిచ్చారు.
సమన్యాయం అంటే ఏమిటో చెప్పు: సురేష్ షెట్కార్తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పదే పదే సమన్యాయం అనడాన్ని ఎంపీ సురేశ్ షెట్కార్ ధ్వజమెత్తారు. ఆ సమన్యాయం ఏమిటో ఏనాడైనా చెప్పావా? అని మండిపడ్డారు. ఆ న్యాయం ఏమిటో, ఆ సమస్య ఏమిటో చెబితే పార్లమెంట్లో చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
తెలంగాణ కోరేది అందుకే: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
లోక్‌సభలో జరిగిన ఘటనను దుర్మార్గ చర్యగా రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రులు ఇలా చేస్తున్నారు కనుకనే తెలంగాణ కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని సీరియ