అతివిశ్వాసం వద్దు- బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో అద్వానీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తేలికగా గెలుస్తామన్న అతివిశ్వాసం పెట్టుకోరాదని బీజేపీ కురువద్ధుడు ఎల్‌కే అద్వానీ, పార్టీ నేతలను హెచ్చరించారు. 2004లో అలాంటి అతివిశ్వాసంతోనే రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయామని గుర్తు చేశారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం మాట్లాడిన ఆయన, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీలో ఇప్పుడున్నంత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం ముందెన్నడూ చూడలేదని అన్నారు. దేశంలో నరేంద్రమోడీ నిర్వహించినన్ని ఎన్నికల ర్యాలీలు ఏ ఇతర నాయకుడూ నిర్వహించలేదని చెప్పారు. మోడీ ఇప్పటికే దాదాపు 70 ర్యాలీలు నిర్వహించారని, ఎన్నికల నాటికి వాటి సంఖ్య వందకు మించుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌ను ఆయన అన్నిరంగాల్లో అభివద్ధి చేశారని కొనియాడారు.ఇటీవల ఐదు రాష్ర్టాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో మొత్తంగా కేవలం 126 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ నైతికంగా పతనమైనట్లేనని అన్నారు. గతంలో మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన అద్వానీ తాజాగా చేసిన ప్రశంసలు పార్టీ నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

modirajnadh కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుంది: సుష్మాస్వరాజ్
కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు దేశాన్ని దోచుకోవటమే కాకుండా, రాజ్యాంగ సంస్థలైన కాగ్, సీవీసీ వంటి వాటిని కూడా అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ పెద్ద అబద్దాలకోరని మండిపడ్డారు. ప్రధాని అభ్యర్థిని ఎన్నికల ముందే ప్రకటించే సంప్రదాయం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై ఆమె విరుచుకుపడ్డారు. సంప్రదాయమనేది పార్టీ నేతలు, కార్యకర్తల్లో ముందునుంచే ఉంటుంది కానీ, చివరి క్షణంలో ఒక్కరు చెపితే నిర్ణయించేది కాదని అన్నారు.

modirajnadh1

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.