అడ్డుకునేందుకు సీమాంధ్ర బాబుల కుట్ర: హరీష్

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర బాబులు కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ నేత జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబులు ముగ్గురు సీమాంధ్ర బాబులేనని, ముగ్గురు ఒక్కటేనని హరీష్‌రావు మండిపడ్డారు. ముగ్గురు కలిసి తెలంగాణను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవని వివరించారు. సీఎం కిరణ్ ఏకంగా తన సొంత జిల్లా చిత్తూరుకు ఏడు వందల కోట్లు నీటి కోసం కేటాయించుకున్నారని విమర్శించారు. సీఎం కిరణ్‌ణ, చంద్రబాబు నీది తెనాలి, నాది తెనాలి అన్నట్లు నీది చిత్తూరు జిల్లే, నాది చిత్తూరుజిల్లే అనే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ చంద్రబాబు నియోజక వర్గం కుప్పంకు కూడా తన నిధులలో వాటా కేటాయించారని, తన మైత్రిని చాటుకున్నారని వివరించారు. మేం పది నెలలుగా నిధులు కావాలని తిరుగుతుంటే సీఎం పట్టించుకోలేదని, అన్న మాట ప్రకారం తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వడంలేదని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.